నిండా మునిగిపోతున్న హీరోయిన్లు ... సాంతం మోసపోయాక ల‌బోదిబో అంటున్నారు

సినిమా పరిశ్రమలో భారీగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఉన్నారు.ఒక్కోసినిమాకు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు.

 Tollywood Heroines Are In Big Loss Now, Tollywood Heroines, Anushka Shetty, Raku-TeluguStop.com

ఈ డబ్బును రకరకాల వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారు నటీమణులు.ఇందులో కొందరు రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు.

మరికొందరు పబ్బులు, ఇంకొందరు హోటళ్లు, రెస్టారెంట్లలో పెట్టుబడులు పెడుతున్నారు.కొందరు నటీనటులు సినిమాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు.

భారీగా వడ్డీలు వస్తాయనే కారణంతోనే ఆయా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.అయితే ఈ పెట్టుబడుల మూలంగా కొందరు హీరోయిన్లలు చాలా సొమ్ము పోగొట్టుకున్నారు.

ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ వ్యాపారంలో పెట్టుబడులు భారీగా పెట్టింది.

అటు జేజెమ్మ అనుష్క శెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు పోసింది.కొందరు మీడియం రేంజ్ హీరోయిన్లు సినిమాల్లోనూ పెట్టుబడులు పెట్టటారు.5 నుంచి 10 రూపాయల మేర వడ్డీ వస్తుందని కొందరు బ్రోకర్లు చెప్పడంతో వారి మాటలు నమ్మి డబ్బులు పెట్టారు.

Telugu Anushka Estate, Anushka Shetty, Brokers, Corona Wave, Mid Range, Interest

ప్రస్తుతం వడ్డీ సంగతి దేవుడు ఎరుగు అసలు వచ్చే దిక్కులేక ఇబ్బందులు పడుతున్నారు.

అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి నెలకొంది సదరు హీరోయిన్లకు.ముందుకు తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటే.

అసలు అంత వడ్డీకి అప్పు ఇవ్వడం నేరం కాబట్టి ముందుగా హీరోయిన్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Telugu Anushka Estate, Anushka Shetty, Brokers, Corona Wave, Mid Range, Interest

అందుకే ఫిర్యాదు చేసేందుకు సదరు నటీమణులు ముందుకు రావడం లేదు.కష్టపడి సంపాదించిన డబ్బు ఉత్తి పుణ్యానికి కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అటు ఎక్కువ వడ్డీ ఇప్పిస్తామని చెప్పే బ్రోకర్ల మాటలు అస్సలు నమ్మకూడదని చెప్తున్నారు.

ఏవైనా వ్యాపారాలు చేయాలి అనుకున్నా.తమకు బాగా తెలిసిన వ్యక్తులతోనే చేయాలని చెప్తున్నారు.

లేదంటే అసలుకే ఎసరు రావడం ఖాయమని చెప్తున్నారు.డబ్బు ఉంది కదా అని అడ్డగోలుగా ఖర్చుచేయొద్దని జాగ్రత్తలు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube