అన్నీ ఉన్నా ఈ అమ్మడు ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది...

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈశ్వర్ దర్శకత్వం వహించిన “సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన టాలీవుడ్ హీరోయిన్ “శ్రద్ధా దాస్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, నటన ప్రతిభ ఉన్నటువంటి శ్రద్ధా దాస్ ఇప్పటివరకు తనకంటూ సినీ కెరీర్ లో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

 Tollywood Heroine Shraddha Das Movie Offers News,tollywood Heroine Shraddha Das-TeluguStop.com

దీనికి తోడు ఇప్పటి వరకు శ్రద్ధా దాస్ నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం పాత్రలు గెస్ట్ అప్పియరెన్స్, కామెడీ అప్పీయరెన్స్, రెండో హీరోయిన్ వంటి పాత్రలు ఎక్కువగా ఉండడంతో ఈ అమ్మడుకి పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ శ్రద్ధ దాస్ తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, తదితర భాషలలో కూడా హీరోయిన్ గా నటించింది.

కాగా ఆ మధ్య కాలంలో తెలుగులో మొదలైనటువంటి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో నాలుగో సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో వినిపించినప్పటికీ ఇప్పటివరకు తనని కంటెస్టెంట్ గా పాల్గొనమని షో నిర్వాహకులు సంప్రదించలేదని అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో శ్రద్దాదాస్ నిరీక్షణ, అర్థం, అనే చిన్న బడ్జెట్ తరహా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

అంతేకాక కన్నడలో ఇటీవలే కోటిగబ్బ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube