తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో సమీరా రెడ్డి నటిగా మంచిపేరును సంపాదించుకున్నారు.విజయ భాస్కర్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాతో పాటు నరసింహుడు, అశోక్ సినిమాల్లో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించారు.పెళ్లి తరువాత సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నారు.2014 సంవత్సరంలో ప్రముఖ బిజినెస్ మేన్ అక్షయ్ వర్ధేనిని సమీరారెడ్డి వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమీరారెడ్డి తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.ఒకవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ కు కూడా సమీరారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
సమీరారెడ్డి అక్షయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం.పెళ్లికి ముందు సమీరారెడ్డి రెండు సంవత్సరాలు అక్షయ్ వర్ధేనితో డేటింగ్ లో ఉన్నారు.
సమీరా భర్త అక్షయ్ ఒక మోటార్ సైకిల్ షోరూమ్స్ కు ఓనర్ కావడం గమనార్హం.బైక్స్ ను అమితంగా ఇష్టపడే సమీరా రెడ్డి పెళ్లికి ముందు భర్తతో కలిసి చాలాసార్లు రైడింగ్ కు వెళ్లారు.పెళ్లికి అక్షయ్ బైక్ పైనే రావడం గమనార్హం.2014 సంవత్సరం జనవరి నెల 21వ తేదీన సమీరా, అక్షయ్ ల వివాహం జరిగింది.సమీరా అక్షయ్ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.సమీరారెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు.
అనాథ పిల్లల కొరకు సమీరా రెడ్డి ఒక ఎన్జీవోను రన్ చేస్తున్నారు.సమీరా రెడ్డికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండగా లాక్ డౌన్ సమయంలో సమీరారెడ్డి షేర్ చేసిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
తెలుగు, హిందీ సినిమాలతో పాటు కన్నడ సినిమాల్లో కూడా సమీరా నటించారు.