సమీరా రెడ్డి భర్త ఏం చేస్తుంటారో మీకు తెలుసా..? - Tollywood Heroine Sameera Reddy Love Marriage Rare Things Details Viral

chiru and ntr heroine sameera reddy love marriage rare things details . viral, love marriage, sameera reddy, secrets, star heroine, chranjeevi, ntr, sameera reddy husband, sameera reddy love story, sameera reddy husband akshay, motor cycle showroom owner - Telugu Chranjeevi, Love Marriage, Motor Cycle Showroom Owner, Ntr, Sameera Reddy, Sameera Reddy Husband, Sameera Reddy Husband Akshay, Sameera Reddy Love Story, Secrets, Star Heroine

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో సమీరా రెడ్డి నటిగా మంచిపేరును సంపాదించుకున్నారు.విజయ భాస్కర్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాతో పాటు నరసింహుడు, అశోక్ సినిమాల్లో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించారు.పెళ్లి తరువాత సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నారు.2014 సంవత్సరంలో ప్రముఖ బిజినెస్ మేన్ అక్షయ్ వర్ధేనిని సమీరారెడ్డి వివాహం చేసుకున్నారు.

 Tollywood Heroine Sameera Reddy Love Marriage Rare Things Details Viral-TeluguStop.com

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమీరారెడ్డి తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.ఒకవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ కు కూడా సమీరారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

సమీరారెడ్డి అక్షయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం.పెళ్లికి ముందు సమీరారెడ్డి రెండు సంవత్సరాలు అక్షయ్ వర్ధేనితో డేటింగ్ లో ఉన్నారు.

 Tollywood Heroine Sameera Reddy Love Marriage Rare Things Details Viral-సమీరా రెడ్డి భర్త ఏం చేస్తుంటారో మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Chranjeevi, Love Marriage, Motor Cycle Showroom Owner, Ntr, Sameera Reddy, Sameera Reddy Husband, Sameera Reddy Husband Akshay, Sameera Reddy Love Story, Secrets, Star Heroine-Movie

సమీరా భర్త అక్షయ్ ఒక మోటార్ సైకిల్ షోరూమ్స్ కు ఓనర్ కావడం గమనార్హం.బైక్స్ ను అమితంగా ఇష్టపడే సమీరా రెడ్డి పెళ్లికి ముందు భర్తతో కలిసి చాలాసార్లు రైడింగ్ కు వెళ్లారు.పెళ్లికి అక్షయ్ బైక్ పైనే రావడం గమనార్హం.2014 సంవత్సరం జనవరి నెల 21వ తేదీన సమీరా, అక్షయ్ ల వివాహం జరిగింది.సమీరా అక్షయ్ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.సమీరారెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు.

అనాథ పిల్లల కొరకు సమీరా రెడ్డి ఒక ఎన్జీవోను రన్ చేస్తున్నారు.సమీరా రెడ్డికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండగా లాక్ డౌన్ సమయంలో సమీరారెడ్డి షేర్ చేసిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

తెలుగు, హిందీ సినిమాలతో పాటు కన్నడ సినిమాల్లో కూడా సమీరా నటించారు.

#Sameera Reddy #Chranjeevi #Star Heroine #Love Marriage #SameeraReddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు