బాగా సన్నబడిన పూనమ్ కౌర్... అందుకేనా.... 

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన “మాయాజాలం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగు బ్యూటీ “పూనమ్ కౌర్” గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పరవాలేదనిపించినా తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఎక్కువగా సినిమా అవకాశాలను దక్కించుకోలేక పోయింది.

 Tollywood Heroine Poonam Kaur Weight Loss Photos Viral-TeluguStop.com

 దీంతో ఇప్పటి వరకు చెప్పుకోవటానికి సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

అయితే ఈ మధ్యకాలంలో పూనమ్ కౌర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

ఇందులో భాగంగా తాజాగా పూనమ్ కౌర్  తన లేటెస్ట్ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. దీంతో పూనమ్ కౌర్ అందానికి ఫిదా అయినటువంటి ఆమె అభిమానులు అల వైకుంఠపురంలో చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన “మేడం సార్….

 మేడమ్ అంతే… “  అనే డైలాగ్ ని వల్లిస్తున్నారు. అంతేగాక ఈ ఫోటోలను షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.

అయితే పలు వ్యక్తిగత కారణాల వల్ల పూనమ్ కౌర్ గత కొద్ది కాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.దీంతో తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు పూనమ్ కౌర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఐతే ఈ  విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూనమ్ కౌర్ తమిళంలో “నందు ఎం నన్బన్” అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా  నటిస్తోంది.అయితే ఈ చిత్ర చిత్రీకరణ పనులు మొదలై ఇప్పటికే చాలా కాలం కావస్తున్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు.

అలాగే ఇటీవలే ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube