ఈ చిన్న పాప ప్రస్తుతం  తెలుగు హీరోయిన్ అని తెలుసా…?  

Heroine Mehreen Pirzada Childhood unseen Photos, Mehreen Pirzada, Tollywood heroine, Childhood photos, Tollywood - Telugu Childhood Photos, Heroine Mehreen Pirzada Childhood Unseen Photos, Mehreen Pirzada, Tollywood, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” చిత్రంలో నేచురల్ స్టార్ నాని సరసన నటించి తన నటన, అభినయం, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “హీరోయిన్ మెహరిన్ పిర్జాడ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఈ అమ్మడు షూటింగులు లేక ఇంటి పట్టునే ఉంటోంది.

TeluguStop.com - Tollywood Heroine Mehreen Childhood Photos

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంది.

TeluguStop.com - ఈ చిన్న పాప ప్రస్తుతం  తెలుగు హీరోయిన్ అని తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా తాజాగా మెహరీన్ తన చిన్నప్పుడు దిగినటువంటి ఓ ఫోటో ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

అంతేకాక ఇది తన చిన్నప్పటి ఫోటో అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో కొంతమంది మెహరీన్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.

అంతేగాక చిన్నప్పుడు మెహరీన్ చాలా ముద్దుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే మెహరిన్ ఈ ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపుగా 50 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

కాగా ఈ అమ్మడిని ఇన్స్టాగ్రామ్  ఖాతాని దాదాపుగా 23 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు నటించినటువంటి అశ్వద్ధామ, ఎంత మంచి వాడవురా ! తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి.

దాంతో ఈ అమ్మడుకి ప్రస్తుతం ఎలాంటి కొత్త  సినిమా అవకాశాలు లేవు. దీంతో తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

#HeroineMehreen #Mehreen Pirzada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Heroine Mehreen Childhood Photos Related Telugu News,Photos/Pics,Images..