పాపం కాజల్ అగర్వాల్... ఆ హీరో కొడుకుతో సినిమా చేయనని చెప్పినందుకు...

తెలుగులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించినటువంటి లక్ష్మీ కళ్యాణం అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై టాలీవుడ్ చందమామ గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.

 Tollywood Heroine Kajal Aggarwal Movie Offer Lose News Viral-TeluguStop.com

అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని దక్కించుకుని దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ హీరోల వరకూ అందరి సరసన నటించి కవర్ చేసింది.

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కు సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 Tollywood Heroine Kajal Aggarwal Movie Offer Lose News Viral-పాపం కాజల్ అగర్వాల్… ఆ హీరో కొడుకుతో సినిమా చేయనని చెప్పినందుకు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన  ఓ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుందని కానీ ఆ చిత్రంలో నటించిన సీనియర్ హీరో కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటిస్తే తాను నటించనని తెగేసి చెప్పాడట.

దాంతో దర్శకుడు చేసేదేమీలేక కాజల్ అగర్వాల్ కి బదులుగా మరో  హీరోయిన్ ని  నటింప చేశాడని  పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.దీంతో కొందరు నెటిజన్లు కాజల్ అగర్వాల్ కి అవకాశం రాకుండా చేసినటువంటి ఆ సీనియర్ హీరో ఎవరా అంటూ సోషల్ మీడియా లో వెతుకులాట మొదలుపెట్టారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ వరుస సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడుపుతోంది.కాగా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ శంకర్ ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 చిత్రంలో 80 సంవత్సరాలు కలిగినటువంటి బామ్మ పాత్రలో నటిస్తోంది.

అలాగే మంచు హీరో విష్ణు హీరోగా నటిస్తున్న మోసగాళ్లు అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

#SS Rajamouli #Jr NTR #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు