ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “లక్ష్మీ కళ్యాణం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన టాలీవుడ్ చందమామ “కాజల్ అగర్వాల్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే ఫర్వాలేదనిపించడంతో వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

 Tollywood Heroine Kajal Agarwal Face App Photos Viral ,kajal Agarwal,tollywood H-TeluguStop.com

దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా టాలీవుడ్ లోని అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులని బాగానే మెప్పించింది.అయితే కాజల్ అగర్వాల్ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో కూడా నటించి బాగానే మెప్పించింది.

కానీ తెలుగులో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించడంతో ఇక్కడే సెటిల్ అయ్యింది.

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ ఫోటోలను పరిశీలించినట్లయితే కొందరు అభిమానులు కాజల్ అగర్వాల్ బ్యూటిఫుల్ ఫోటోలను కలెక్ట్ చేసి ఫేస్ యాప్ ద్వారా చిన్నప్పటి ఫోటోలుగా క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు. దీంతో కాజల్ అభిమానులు తమ అభిమాన నటి చిన్నప్పటి లుక్ ఫోటోలు చాలా క్యూట్ గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో “మోసగాళ్ళు” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, తదితర భాషలలో విడుదల కానుంది.

 అయితే ఇటీవలే ఈ చిత్రానికి టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube