క్యాస్టింగ్ కౌచ్ పై ఇలియానా షాకింగ్ కామెంట్స్..?

టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా గురించి, తన అందం, నటన గురించి అందరికీ తెలిసిందే.తన నడుము అందాలతో నడుము సుందరిగా పేరు తెచ్చుకొని ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.

 Tollywood Beauty Ileana Shocking Comments On Casting Couch,  Tollywood, Heroine,-TeluguStop.com

అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను కూడా సంపాదించుకుంది.

ఇలా ఉంటే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

మొదట దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని తిరిగి వెనక్కి చూడకుండా వరుస సినిమాలతో ఓరేంజ్ దూసుకుపోయింది.ఒక్క ఏడాదికే వరుస సినిమాలతో స్టార్ హీరోలకు పోటీగా నిలిచింది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా గుర్తింపు పొందగా.ఆ తర్వాత ఉన్నట్టుండి శరీర బరువు పెంచుకొని అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

అదే సమయంలో రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించగా ఈ సినిమా తనకు అంత గుర్తింపు ఇవ్వలేదు.ఇక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది.

Telugu Bolywood, Souch, Ileana, Offers, Responce, Tollywood-Movie

ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టగా అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది.ఈ మధ్య తన శరీర బరువును పూర్తిగా తగ్గించుకొని మునుపటిలా తయారయింది.పైగా గ్లామర్ డోస్ ను కూడా పెంచింది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.

Telugu Bolywood, Souch, Ileana, Offers, Responce, Tollywood-Movie

ఇక ఇటీవలే రీఎంట్రీ ఇవ్వగా ఓ సినిమాలో అవకాశం అందుకుంది.ఇదిలా ఉంటే తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఇప్పటికీ ఉందని. సినిమా అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకులు శారీరక అవసరాలు తీర్చమని అడుగుతున్నారు అంటూ మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టింది ఇలియానా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube