గుడి కడుతాం అంటూ అనుష్కకు ఆఫర్.. వద్దంటూ వారికి షాక్!

సినీ ఇండస్ట్రీలో నటీనటులకు ఎనలేని క్రేజ్ ఉంటుంది.అంతేకాకుండా వాళ్లకు విపరీతమైన అభిమానం ఉంటుంది.

 Tollywood Heroine Anushka Rejectec Offer To Build A Temple-TeluguStop.com

ఒక్కోసారి నటీనటులపై అభిమానులు చూపించే ప్రేమను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.కొందరు అభిమానులు తమ అభిమానులను కలుసుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంటారు.

మరికొందరు తమ అభిమానుల నటుల పేర్లమీద కొన్ని రకాల సహాయాలు చేస్తుంటారు.ఇక కొంతమంది ఏకంగా గుడినే కడుతుంటారు.

 Tollywood Heroine Anushka Rejectec Offer To Build A Temple-గుడి కడుతాం అంటూ అనుష్కకు ఆఫర్.. వద్దంటూ వారికి షాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే అనుష్కకు కూడా గుడి కడుతాము అంటూ కొందరు అభిమానులు ముందుకు వచ్చారు.


టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తన నటనతో, తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.సూపర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుసగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ఇక తను నటించిన అరుంధతి సినిమా కు ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించింది.

కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ బాహుబలి లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఈమె నటించిన అరుంధతి సినిమా తమిళంలో కూడా డబ్బింగ్ తో విడుదలవ్వగా ఈమె నటనను చూసి తమిళ ప్రజలు ఫిదా అయ్యారు.తమిళంలో తన మొదటి సినిమాతోనే తమిళ ప్రజలను అభిమానులుగా మార్చుకుంది.

ఇక తమిళ ప్రజలు ఎవరికైనా అభిమానం చూపిస్తే మాత్రం వాళ్ల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీలో నటించిన కొందరు హీరోయిన్ లకు పలు జ్ఞాపకాలు అందించారు.గతంలో హీరోయిన్స్ కుష్బూ, నమిత లకు ఏకంగా గుడినే కట్టించారు తమిళ అభిమానులు.వాళ్లపై ఎంతో అభిమానాన్ని పెంచుకొని వాళ్ల కోసం గుడిని కట్టించడానికి ముందుకు వచ్చారు.

అరుంధతి సినిమా తర్వాత అనుష్క పై విపరీతమైన అభిమానం పెంచుకున్న తమిళ ప్రజలు అనుష్క కోసం కూడా గుడి కట్టించాలని అనుకున్నారు.ఈ విషయాన్ని గతంలో అనుష్కకు ఆ అభిమానులు తెలపగా అనుష్క మాత్రం సాఫ్ట్ గా నాకు గుడి లాంటివి కట్టవద్దు అంటూ వాళ్లని కోరింది.దీంతో అభిమానులు కాస్త నిరాశ పడగా ఎన్నటికైనా మీ పై అభిమానం మాత్రం మారదు అంటూ తెలిపింది.ఇక దీంతో కొందరు అభిమానులు కుష్బూ, నమితల లాగా అనుష్క వారి బాటలో నడవడానికి ఇష్టపడలేదు అని తెలిపారు.
ఈమెకు తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అభిమానులున్నారు.కానీ గుడి కట్టించే అంత అభిమానం మాత్రం చూపించలేకపోయారు.

ఇక ఈమె గతంలో నిశబ్దం సినిమాలో నటించగా ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వలేదు.ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటుంది.

ఇటీవలే నయనతార నటించిన తమిళ సినిమా రీమేక్ ను నటించడానికి ముందుకు వచ్చిందని తెలిసింది.కానీ ఆ సినిమా మాత్రం తమిళంలో అంత సక్సెస్ కాలేదు.

తెలుగులో మరో సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.

#Temple Reaject #KhushbooNamitha #Anushka Shetty #Arundathi #AnushkaBuild

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు