తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “మజ్ను” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన మలయాళ కుట్టి “అనూ ఇమాన్యుల్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యాక్షన్ హీరో గోపీచంద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని నాగచైతన్య తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
కానీ ఈ అమ్మడు స్టార్ హీరోలతో కలిసినటించిన చిత్రాలన్నీ దాదాపుగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో దాదాపుగా రెండేళ్లుగా సరైన హిట్ లేక కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో తీవ్రంగా విఫలమవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా తాజాగా అనూ ఇమాన్యుల్కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే అప్పట్లో మలయాళంలో ప్రముఖ దర్శకుడు కమల్ దర్శకత్వం వహించిన “స్వప్న సంచారి” అనే చిత్రంలో నటిస్తున్న సమయంలో స్కూల్ యూనిఫారం దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి పాత్రలో ఫోటో దిగినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ ఫోటోపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ స్కూల్ యూనిఫారం దుస్తుల్లో అనూ పాప చాల క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనూ ఇమాన్యుల్ కి చేతిలో కొత్త సినిమా అవకాశాలు లేనందున ఖాళీగా గడుపుతోంది.
కానీ తాజాగా తెలుగులో కందిరీగ, రభస, హైపర్, తదితర చిత్రాలకి దర్శకత్వం వహించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వం వహిస్తున్న “అల్లుడు అదుర్స్” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పనులను వాయిదా వేశారు.