తన పేరు నుంచి 'అక్కినేని'ని తొలిగించిన సమంత.. గొడవలే కారణం అంటూ?

సమంత అక్కినేని ఈ పేరుతో ప్రత్యేక పరిచయం అవసరం లేదు.“ఏ మాయ చేసావే” సినిమా ద్వారా అక్కినేని నాగ చైతన్యతో జోడీకట్టి తెలుగు తెరకు పరిచయమై ఎంతో మంది అభిమానులను తన మాయలో పడేలా చేసింది.మొదటి సినిమా విజయవంతం కావడంతో తెలుగులో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.ఈ క్రమంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడి తెలుగింటి కోడలుగా అడుగుపెట్టింది.

 Tollywood Heroine Akkineni Samantha Removes Akkineni In Her Name-TeluguStop.com

నాగచైతన్య సమంత ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో 2018లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లయిన తర్వాత సమంత పలు సోషల్ మీడియా మాధ్యమాలలో తన పేరును “సమంత అక్కినేని” గా మార్చేసింది.

పెళ్లి తర్వాత ఏ మాత్రం తన స్పీడును తగ్గించకుండా ఒక వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లో, టాక్ షో లను నిర్వహిస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉన్నారు.అదేవిధంగా “సాకీ”అని దుస్తుల వ్యాపారాన్ని స్థాపించి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన ఈ నటీమణి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.

 Tollywood Heroine Akkineni Samantha Removes Akkineni In Her Name-తన పేరు నుంచి అక్కినేని’ని తొలిగించిన సమంత.. గొడవలే కారణం అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Akkineni Nagachaithanya, Akkineni Nagarjuna, Akkineni Name, Akkineni Samantha, Tollywood-Movie

ఈ విధంగా సమంత జీవితం సాగిపోతున్న క్రమంలో సమంత ఉన్నఫలంగా తన సోషల్ మీడియా ప్రొఫైల్లో “అక్కినేని” అనే పేరును తొలగించడం ప్రస్తుతం పలు విమర్శలకు దారితీస్తోంది.సమంత ఇన్నిరోజులు ఇంస్టాగ్రామ్,ట్విట్టర్ ప్రొఫైల్ లో ఇన్ని రోజులు “సమంత అక్కినేని” అనే పేరు ఉండేది.సడన్ గా సమంత “అక్కినేని” అనే పేరును తొలగించి ఆ స్థానంలో “S”అనే సింగిల్ లెటర్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇది చూసిన అభిమానులు సమంత ఎందుకు ఇలా తన ఇంటి పేరును తొలగించింది అంటూ పలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఏదైనా ప్రమోషన్లో భాగంగా ఇలా చేస్తోందా.లేక క్యాజువల్ గానే ఇలా ఇంటి పేరును తొలగించారానే విషయంపై అభిమానులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా సమంత ఇంటి పేరుని తొలగించడానికి గల కారణం పై సమంతా స్పందించే వరకు వేచి చూడాలి.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

#Akkineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు