కొత్త సినిమాలతో యంగ్ హీరోలు.. బౌన్స్ బ్యాక్ అయ్యేనా?

Tollywood Heroes Wishing To Bounce Back With Their Latest Projects

కొంత మంది చాలా కాలం సినిమా పరిశ్రమలో ఉన్నా.మంచి గుర్తింపు రాక ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు.

 Tollywood Heroes Wishing To Bounce Back With Their Latest Projects-TeluguStop.com

అందుకే తాజాగా వస్తున్న యంగ్ హీరోలు, హీరోయిన్లు తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.తొలి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తే… తమ కెరీర్ కు తిరుగుండదని భావిస్తున్నారు.

అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు చాలా మంది యంగ్ యాక్టర్స్.సూపర్ డూపర్ కెంటెంట్ తో దుమ్ములేపేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Tollywood Heroes Wishing To Bounce Back With Their Latest Projects-కొత్త సినిమాలతో యంగ్ హీరోలు.. బౌన్స్ బ్యాక్ అయ్యేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎలాగైనా వచ్చే సినిమాలతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారు.ఎవరూ టచ్ చేయని కథకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ జోడించి హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


తాజాగా ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయ సరికొత్త సినిమాత్ కిక్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.తన తాజా మూవీ రాజా విక్రమార్కతో జనాలను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు.శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తాన్య హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా నవంబర్ 12న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.అటు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ తాజాగా మూవీ రొమాంటిక్.కేతిక శర్మ హీరోయిన్ గా అనిల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు ఆకాష్.తన సినిమాకు పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ కూడా ప్రచారం చేశాడు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగాయి.మంచి ఊపుతో అక్టోబర్ 29న ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది.


అటు మంచి సక్సెస్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న నాగ శౌర్య కూడా ఓ మంచి సినిమాతో జనాల ముందుకు వస్తున్నాడు.లక్ష్య, వరుడు కావలెను సినిమాలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్నాడు.రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన వరుడు కావలెను సినిమా అక్టోబర్ 29న విడుదల అవుతుంది.అటు లక్ష్య మూవీ నవంబర్ 12న రిలీజ్ కానుంది.ఈ సినిమాల్లో ఏవి హిట్ కొడతాయో? ఎవరు సక్సెస్ అవుతారో? వేచి చూడాల్సిందే.

#Akash Puri #Karthikeya #Romantic #Young Heroes #Raja Vikramarka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube