ప్లాప్ చిత్రాల నుండి తెలివిగా తప్పించుకొని బయటపడ్డ తెలుగు హీరోలు

కొన్నిసార్లు మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు ఎంతో మేలు చేస్తాయి.లేదంటే చాలా బాధ క‌లిగిస్తాయి.

 Tollywood Heroes Wise Moves While Choosing Stories ,tollywood Heroes,top Heroes-TeluguStop.com

సేమ్ అలాగే సినిమా న‌టులు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు కొన్ని తీవ్రంగా బాధించేవి కాగా.మ‌రికొన్ని రిలీఫ్ ఇచ్చేవిగా ఉన్నాయి.

ఆయా కార‌ణాల‌తో వ‌దులుకున్న సినిమాలు.వేరే హీరోలు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోర ప‌రాజ‌యం పొందిన‌ప్పుడు.

వ‌ద్ద‌నుకుని మంచి ప‌ని చేశాం అనుకుంటారు.అవే సినిమాలు సూప‌ర్ హిట్ అయితే… అన‌వ‌స‌రం వ‌దులుకున్నామే అని బాధ‌ప‌డ‌తారు.అలా వ‌ద్ద‌నుకుని సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

ప్ర‌భాస్ – బ‌ద్రీనాథ్:

Telugu Prabhas, Ram Charan, Tollywoodheroes, Tollywood Heros, Top Heroes-Telugu

బ‌ద్రీనాథ్ సినిమా ఆఫ‌ర్ ముందు ప్ర‌భాస్‌కు వ‌చ్చింద‌.ఈ స్టోరీని వినాయ‌క్ తొలుత‌ ప్ర‌భాస్ కు వినిపించాడు.డేట్స్ కుద‌ర‌క‌ ప్ర‌భాస్ నో చెప్పాడు.ఆ త‌ర్వాత అల్లూ అర్జున్ స‌రే అని చెప్పాడు.సినిమాపై భారీ అంచ‌నాలు పెర‌గ‌డంతో.అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.

సినిమా ఫ్లాప్ అయ్యింది.సినిమాను వ‌ద్ద‌నుకున్న ప్ర‌భాస్ మంచి నిర్ణ‌యం తీసుకున్నా అనుకున్నాడు.

బాల‌కృష్ణ – వీర:

Telugu Prabhas, Ram Charan, Tollywoodheroes, Tollywood Heros, Top Heroes-Telugu

ర‌వితేజ హీరోగా చేసిన సినిమా వీరు.ఈ సినిమా ఆఫ‌ర్ ముందుగా బాల‌కృష్ణకు వ‌చ్చింది.ఈ యువ‌త‌ర్న వ‌ద్ద‌న చెప్ప‌డంతో ర‌వితేజ చేశారు.చివ‌ర‌కు ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది.

ఊసరవెల్లి- రామ్

Telugu Prabhas, Ram Charan, Tollywoodheroes, Tollywood Heros, Top Heroes-Telugu

ఊసరవెల్లి ఎన్టీఆర్ హీరోగా తెరెక్కింది.ప్రేక్ష‌క ఆద‌ర‌ణ లేక ఫెయిల్ అయ్యింది.ఈ క‌థ‌ను సురేంద‌ర్ రెడ్డి మొద‌ట రామ్ కు వినిపించాడు.ఆయ‌న కొన్ని ఛేంజెస్ కోర‌డంతో.జూనియ‌ర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.త‌ను ఓకే చెప్ప‌డంతో సినిమా తెర‌కెక్కింది.

ర‌భ‌స – రామ్

Telugu Prabhas, Ram Charan, Tollywoodheroes, Tollywood Heros, Top Heroes-Telugu

సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ చేసిన మూవీ ర‌భ‌స‌.ఈ సినిమా స్టోరీని మొద‌ట రామ్ కు చెప్పారు.ఆయ‌న ఓకే చెప్పారు.నిర్మాత బెల్లంకొండతో రామ్‌కు వ‌చ్చిన వివాదం కార‌ణంగా రామ్ ప్లేస్‌లో ఎన్టీఆర్ వ‌చ్చాడు.సినిమా ఫ్లాప్ అయ్యింది.

అనగనగా ఓ ధీరుడు – రామ్ చ‌ర‌ణ్ , రానా, ప్ర‌భాస్

Telugu Prabhas, Ram Charan, Tollywoodheroes, Tollywood Heros, Top Heroes-Telugu

ఈ సినిమా సిద్ధార్థ్ హీరోగా తెర‌కెక్కి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.ఈ మూవీలో సిద్ధార్థ్ పాత్ర‌కోసం డైరెక్ట‌ర్ రామ్ చ‌ర‌ణ్ , రానా, ప్ర‌భాస్ ను క‌లిశాడ‌ట‌.వాళ్లు నో చెప్ప‌డంతో సిద్ధార్థ్ ఈ సినిమాలో న‌టించాడు.

ఇద్దరమ్మాయిలతో -ఎన్టీఆర్

Telugu Prabhas, Ram Charan, Tollywoodheroes, Tollywood Heros, Top Heroes-Telugu

అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.ఈ క‌థ పూరీ ఎన్టీఆర్ కోసం రాశాడ‌ట‌.అయితే ఎన్టీఆర్ నో చెప్ప‌డంతో బ‌న్నీ హీరోగా చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube