సొంత మరదళ్ళనే పెళ్లాడిన మనకు ఇష్టమైన హీరోలు ఎంత మంది ఉన్నారో తెలుసా..?- Tollywood Heroes Married Their Own Cousins

Tollywood Heroes married their own Cousins , Tollywood Heroes ,Cousins, Senior NTR, basava tarakam, Akkineni Annapurna, Super Star Krishna Wife, Hero Karthi, Aadi Sai Kumar - Telugu Aadi Sai Kumar, Akkineni Annapurna, Basava Tarakam, Cousins, Hero Karthi, Senior Ntr, Super Star Krishna Wife, Tollywood Heroes, Tollywood Heroes Married Their Own Cousins, Tollywood Heros Marriages

ఈ రోజుల్లో ప్రేమించడం, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే ఆ బంధానికి విడాకులు ద్వారా వీడ్కోలు చెప్పడం.ఇవండీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ప్రేమ వివాహాలు.

 Tollywood Heroes Married Their Own Cousins-TeluguStop.com

పాత రోజులు అయితే ఇలా ఉండేది కాదు పెద్ద వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళికి ముందు ప్రేమ లేకపోయినా పెళ్లి తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం చేసేవాళ్ళు.ఒక్కసారి ఒకరికొకరు అర్థమయ్యాక ఆ బంధం లైఫ్ లాంగ్ కొనసాగడం చచ్చిపోయే వరకు సంతోషంగా ఉన్న జంటలను మనం చాలా మందిని చూస్తూ ఉంటాం.

ఈ కాలంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని సక్రమంగా జీవితాంతం హ్యాపీ ఉన్నవారు కూడా ఉన్నారు కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.
అందుకే మన టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రేమ పెళ్లి అని పోకుండా వాళ్ళ కుటుంబంలోనే ఉన్న వారి మరదళ్ళను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు.

 Tollywood Heroes Married Their Own Cousins-సొంత మరదళ్ళనే పెళ్లాడిన మనకు ఇష్టమైన హీరోలు ఎంత మంది ఉన్నారో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అలా పెద్దలు కుదిర్చిన మరదళ్ళను సంబంధం చేసుకున్న సెలబ్రిటీస్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లిస్టులో మనకు మొదట వినిపిస్తున్న పేరు మన సీనియర్ ఎన్టీఆర్ గారు.ఆయన తమ మామ కూతురు అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు.అయితే ఆయన పెళ్లప్పుడు ఎన్టీఆర్ ఆస్తులన్నీ కరిగిపోతాయట అయినా సరే ఎన్టీఆర్ మీద ఇష్టంతోనే డబ్బుని ఆశించకుండా బసవతారకం గారు ఎన్టీఆర్ గారిని పెళ్లాడారు.

ఇక లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరావు గారు కూడా తన మరదలైన అన్నపూర్ణమ్మని పెళ్లి చేసుకున్నాడు.అయితే మొదట్లో ఆ పెళ్ళికి అంగీకరించకుండా మారం చేసినా ఆ తరువాత ఒప్పించి పెద్దలందరు అతనికిచ్చి వివాహం చేశారు.అయితే పెళ్లయ్యాక మాత్రం వీళ్లిద్దరూ ఎంతో ఆదర్శప్రాయంగా జీవించారు .

ఇది మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా తన మొదలైన అందాల పుత్తడి బొమ్మ ఇందిరమ్మ గారితో ఒక్క చూపులోనే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు.ఆ తర్వాత సినిమాల్లో నటించేటప్పుడు కృష్ణ గారు హీరోయిన్ విజయనిర్మల ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయినా సరే మొదటి భార్యను ఇందిరమ్మ గాంధీ మాత్రం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.

ఇక ఈ లిస్ట్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం ఉన్నారు.ఈయన తన మరదలైన నిర్మల దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు.మోహన్ బాబు మొదటి భార్య లక్ష్మి ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో పిల్లల కోసం ఆయన మరదల్ని పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు.

దశాబ్దాలుగా వీరిది అన్యోన్య దాంపత్యంగా ఉంటూ వస్తుంది.

సాయి కుమార్ నటనకు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ పెళ్లాడింది కూడా తన సొంత మరదలినే.సాయి కుమార్ భార్య తమ్నుడి కూతురిని హీరో ఆది పెళ్లి చేసుకున్నారు.  వీరిది చిన్నప్పుడే పెద్దలు నిర్ణయించిన వివాహమట.

వీరికి ఒక కుమార్త ఆయాన కూడా ఉంది .ఇక ఈ లిస్టులో హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా ఉన్నాడు.యుగానికి ఒక్కడు సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన ఇటీవల ఖైదీ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకని సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాడు.అయిన సూర్య లాగా ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తన సొంత మరదలైన రజనీని పెద్దలు నిశ్చయంతో పెళ్లి చేసుకున్నాడు.

రజని MA లిటరేచర్ లో గోల్డ్ మెడలిస్ట్ వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.

ఇక ఈ లిస్ట్ లో మరొక సౌత్ ఇండియన్ హీరో శివ కార్తికేయన్ కూడా ఉన్నారు.ఈయన కూడా తన మామ కూతురు ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక కూతురు కూడా ఉంది.

#Senior Ntr #Cousins #TollywoodHeroes #Hero Karthi #TollywoodHeros

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు