మెగాస్టార్ నుండి రామ్ చరణ్ వరకు…ఈ 12 మంది తెలుగు జంటల పెళ్లిపత్రికలు ..ఎలా ఉన్నాయో చూడండి

సినిమా వాళ్ళంటే స్టార్ లు, ఆకాశంలో కనిపించే తారలుగా వాళ్ళని ప్రేక్షకులు ఆరాధిస్తారు.మనకి మన బంధువుల గురించి కంటే కూడా ముందు ఈ సెలబ్రిటీల అప్ డేట్స్ తెలుసుకోవాలన్న ఆతురత ఎక్కువగా ఉంటుంది.

 Tollywood Heroes Marriage Invitation Cards Viral Social-TeluguStop.com

వాళ్ళు ఏ సినిమా చేస్తున్నారో? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఈసారి వెకేషన్ కి ఏ కంట్రీ వెళ్లారు? ఏ ఫంక్షన్ లో మెరవనున్నారు? ఇలా సెలబ్రిటీల ప్రతీ మూమెంట్ మీద ప్రేక్షకులు, అభిమానులు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు.అలాంటిది ఇక అదే సెలబ్రిటీకి పెళ్ళంటే అబ్బో తమ ఇంట్లో పెళ్లి అన్నట్టుగా మురిసిపోతారు.

అయితే ఈ పెళ్ళి వేడుకను సెలబ్రిటీలు లైవ్ లో చూస్తే, ఆ సెలబ్రిటీలందరినీ ఒకే చోట చూస్తూ పెళ్లి వేడుకను లైవ్ టెలికాస్ట్ లో ఎంజాయ్ చేసేది ప్రేక్షకాభిమానులు.పెళ్ళంటే గుర్తొచ్చింది, తాళిబొట్టు, జీలకర్ర బెల్లం, పెళ్లిమండపం, వధూవరులు, ఆశీర్వదించే పెద్దలు, పంతులు, పంతులు గారు పెట్టే ముహూర్తం ఇవి కావాలి.

 Tollywood Heroes Marriage Invitation Cards Viral Social-మెగాస్టార్ నుండి రామ్ చరణ్ వరకు…ఈ 12 మంది తెలుగు జంటల పెళ్లిపత్రికలు ..ఎలా ఉన్నాయో చూడండి-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీటన్నిటికంటే ముందు పెళ్ళిపెద్దలను పిలిచేందుకు కావల్సిన ముఖ్యమైన వస్తువు ఒకటుంది.అదే పెళ్లిపత్రిక.ఈ పెళ్లిపత్రికే లేకపోతే ముహూర్తం ఎప్పుడో తెలీదు, వధూవరులు ఎవరో తెలీదు, పెళ్లి ఏ మండపంలో జరుగుతుందో? ఏ ఊళ్ళో జరుగుతుందో తెలియదు.అసలైంది భోజనాలు ఎప్పుడు పెడతారో తెలీదు.

ఇవన్నీ తెలుస్తాయనే పెళ్లిపత్రికలు కొట్టించి, బంధువులకి, స్నేహితులకి, సన్నిహితులకి అందజేసి కబురు చేస్తారు.ఈ మధ్య పెళ్లిపత్రికలను చాలా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయిస్తున్నారు.

పెళ్లిపత్రిక బట్టి పెళ్లి ఎంత గ్రాండ్ గా జరగబోతుందో అనేది చెప్పవచ్చు.అందుకే మా ఇంట పెళ్లి, పండుగలా జరగబోతుంది, రండి సంబరాలు చేసుకుందాం అన్నట్టు డిజైన్ చేయిస్తున్నారు.

ఇక సెలబ్రిటీల పెళ్లిపత్రికల గురించి ఐతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.అభిమానుల కోసం సోషల్ మీడియాలో పెళ్లిపత్రికలను పోస్ట్ చేసి సంతోషపరుస్తారు సెలబ్రిటీలు.మరి మన తెలుగు సెలబ్రిటీల పెళ్లిపత్రికలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

నందమూరి తారకరామారావు, బసవరామతారకంల వివాహపత్రిక

నందమూరి తారకరామారావు, బసవరామతారకంల వివాహపత్రిక తెలుగుతనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.శ్రీరస్తు, శుభమస్తు అని మొదలుపెట్టి తెలుగునామ సంవత్సరం, వారం, ఘడియలు, నక్షత్రం, లగ్నం ఇలా అచ్చ తెలుగు పదాలను జోడించి పెళ్లిపత్రికను డిజైన్ చేయించారు.ఎంతైనా అన్న గారు తెలుగు భాషా ప్రియులు కదా.ముహూర్త సమయం కూడా తెలుగులోనే కొట్టించారు.మే 2 వ తారీఖున 1942 లో తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాలకు వీరి వివాహం జరిగింది.

చిరంజీవి, సురేఖ గార్ల పెళ్లిపత్రిక

చిరంజీవి, సురేఖ గార్ల పెళ్లిపత్రిక చూశారా? చాలా సింపుల్ గా ఉంది.ఫిబ్రవరి 20 1980 లో మద్రాస్ లోని, ఎడ్వర్డ్ ఎలియట్స్ రోడ్ నంబర్ 55 లో ఉన్న రాజేశ్వరి కళ్యాణమండపంలో ఉదయం 10.50 కి ముహూర్తం, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రిసెప్షన్, 8 గంటల నుంచి డిన్నర్ ఉంటుందని అంతా ఇంగ్లిష్ లోనే వెడ్డింగ్ కార్డును డిజైన్ చేయించారు.

ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వెడ్డింగ్ కార్డ్

ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వెడ్డింగ్ కార్డ్ చాలా సింపుల్ గా ఉంది.వీరి వివాహం 2011 మే 6 వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది.

రామ్ చరణ్, ఉపాసనల వెడ్డింగ్ కార్డ్


రామ్ చరణ్, ఉపాసనల వెడ్డింగ్ కార్డ్ చాలా సింపుల్ గా డిజైన్ చేయించారు.పెళ్లిపెద్దల పేర్లు, వధూవరుల పేర్లు, డిన్నర్ టైమ్, పెళ్లి జరిగే వెన్యూ ప్లేస్.అంతే.సింపుల్ గా తేల్చేశారు.2012 జూన్ 14 న వీరి వివాహం జరిగింది.

గోపీచంద్ – రేష్మ పెళ్లిపత్రిక


అల్లు అర్జున్ – స్నేహ పెళ్లిపత్రిక


మంచు మనోజ్ – ప్రణతి పెళ్లిపత్రిక


అల్లరి నరేష్ – విరూప పెళ్లిపత్రికవరుణ్ సందేశ్ – వితికా పెళ్లిపత్రికప్రియమణి – ముస్తాఫారాజ్ పెళ్లిపత్రికనాగచైతన్య – సమంత పెళ్లిపత్రికడైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్ కార్డుహీరోలు, హీరోయిన్లే కాదు డైరెక్టర్లు కూడా తమ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకున్నారు.డైరెక్టర్ క్రిష్ అయితే, తమ వెడ్డింగ్ కార్డును రమ్యంగా డిజైన్ చేయించి రమ్యమైన తెలుగు అక్షరాలతో పెళ్ళిపత్రికను అలంకరించి బంధువులను, స్నేహితులను, సన్నిహితులను ఆహ్వానించారు.ఎంతైనా డైరెక్టర్ కదా, ఆ మాత్రం క్రియేటివిటీ ఉంటుందిలెండి…

.

#AllariNaresh #GopichandReshma #NTRLakshmi #TollywoodHero #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు