చరణ్, జూ. ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఆమేనంట..?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్లు అనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలు దర్శకధీరుడి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

 Tollywood Heroes Junior Ntr   Ram Charan First Crush  Details, First Crush, Juni-TeluguStop.com

అయితే ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోల ఫస్ట్ క్రష్ ఒకరే కావడం గమనార్హం.అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఈ ఇద్దరు హీరోల ఫస్ట్ క్రష్.

రామ్ చరణ్ కు చిన్నప్పటి నుంచే శ్రీదేవి అంటే ఎంతో అభిమానం కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం శ్రీదేవిని చూస్తే అన్నీ మరిచిపోతానని చెబుతారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులయ్యారు.

భవిష్యత్తులో మంచి కథ వస్తే మళ్లీ కలిసి నటించడానికి మెగా, నందమూరి ఫ్యామిలీ హీరోలు సిద్ధంగా ఉండటం గమనార్హం.ఆర్ఆర్ఆర్ లో తారమ్ భీమ్ రోల్ లో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు.

మిగిలిన స్టార్ హీరోల విషయానికి వస్తే హీరో సూర్యకు తనకు బంధువయ్యే అమ్మాయి ఫస్ట్ క్రష్ గా ఉన్నారు.టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఫస్ట్ క్రష్ ఐశ్వర్యారాయ్ కాగా ఐశ్వర్య నటించిన అన్ని సినిమాలను అల్లు అర్జున్ చూశారు.

స్టార్ హీరో మహేష్ బాబుకు హాలీవుడ్ ప్రముఖ నటి డెమీ మూర్ ఫస్ట్ క్రష్ గా ఉన్నారు.టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ చిన్నప్పుడు చదివిన స్కూల్ టీచర్ ఫస్ట్ క్రష్ అని సమాచారం.

Telugu Crush, Ntr, Ram Charan, Sridevi-Movie

హీరోయిన్ల విషయానికి వస్తే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు హృతిక రోషన్ ఫస్ట్ క్రష్ కాగా రకుల్ ప్రీత్ సింగ్ కు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఫస్ట్ క్రష్.బాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ కు సౌరభ్ గంగూలీ ఫస్ట్ క్రష్ కాగా ప్రణీత తన స్కూల్ లో చదివిన అబ్బాయి ఫస్ట్ క్రష్ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube