అవకాశం దొరికితే చాలు.. డ్యుయెల్ రోల్స్ తో సత్తా చాటబోతున్న టాప్ హీరోలు..

సినిమా అంటే హీరో.విలన్.హీరోయిన్.హీరోయిన్ ను విలన్ ఏడిపించాలి.విలన్ ను హీరో చితక బాదాలి.హీరోయిన్ హీరోతో ప్రేమలో పడాలి.

 Tollywood Heroes Interest About Dual Roles Details, Tollywood Heroes Heroes Dual-TeluguStop.com

పాత సినిమాలన్నింటిలో దాదాపు ఇదే పాత చింతకాయ పచ్చడి ఉండేది.కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది.

ఇంతకు ముందు హీరోలు రేర్ గా డ్యుయెల్ రోల్స్ చేసే వారు.కానీ ప్రస్తుతం అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నారు.

అంతేకాదు.రెండు క్యారెక్టర్లు పరస్పర విరుద్ధమైన షేడ్స్ తో ఉన్న రోల్స్ చేయడం విశేషం.

హీరో, విలన్ ఒకరే కావడం విశేషం.చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి.

ప్రస్తుతం రవితేజ మరోసారి డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు.ఆయన తాజా మూవీ ఖిలాడీలో రెండు పాత్రలతో అదరగొట్టబోతున్నాడు.

ఇప్పటికే విక్రమార్కుడు, డిస్కోరాజా సినిమాల్లో డ్యుయెల్ రోల్ చేసిన ఆయన తాజాగా మరోసారి డ్యుయెల్ రోల్ చేసి మెప్పించబోతున్నాడు.

ఈ సినిమాకు రమేష్  వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

అటు సుదీర్ వర్మ తెరకెక్కిస్తున్న రావణాసుర మూవీలోనూ లాయర్ క్యారెక్టర్ చేస్తున్నాడు రవితేజ.ఇందులో పది షేడ్స్ ఉన్న రావణాసురుడిగా కనిపించబోతున్నాడట.

Telugu Akhanda, Balakrishna, Bimbi Sara, Harihara, Kalyan Ram, Khiladi, Pawan Ka

అటు బింబిసార సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ రెండు క్యారెక్టర్లు చేస్తున్నాడు.పీరియాడికల్ ఎలిమెంట్స్, లేటెస్ట్ కల్చర్ కలిపి కొనసాగేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బింబిసారతో పాటు ఈ తరం యువకుడిలా రెండు రోల్స్ చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.నాని హీరోగా చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ కూడా పీరియాడికల్ డ్రామాగా వస్తుంది.1970 కోల్ కత్తా  బ్యాంకు  డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.అటు ఈ తరం అబ్బాయిగా కూడా నాని కనిపించబోతున్నాడు.ఫ్లాష్ బ్యాక్ లో సాయిపల్లవి హీరోయిన్ కాగా, లేటెస్ట్ హీరోయిన్ గా  కృతిశెట్టి యాక్ట్ చేస్తుంది.

Telugu Akhanda, Balakrishna, Bimbi Sara, Harihara, Kalyan Ram, Khiladi, Pawan Ka

అటు బాలయ్య అఖండ మూవీలోనూ రెండు రోల్స్ ఉన్నాయి.ఓవైపు శ్రీనివాస్ అనే క్యారెక్టర్, మరోవైపు అఘోరా క్యారెక్టర్ ను బాలయ్య పోషిస్తున్నట్లు తెలుస్తోంది.శ్రీనివాస్, అఖండ వేర్వేరు పాత్రలా? లేక శ్రీనివాసే.అఖండగా మారుతాడా? ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్, లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ వచ్చింది.

Telugu Akhanda, Balakrishna, Bimbi Sara, Harihara, Kalyan Ram, Khiladi, Pawan Ka

అటు సలార్ మూవీలో ప్రభాస్ కూడా రెండు పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అటు పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు లోనూ డ్యుయెల్ రోల్స్ చేస్తున్నాడట.అటు మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ, త్రిషా, జయం రవి సహా టాప్ నటీనటులు చేస్తున్నారు.ఇందులో ఐశ్వర్యారాయ్ రెండు పాత్రలు చేస్తుందట.

రాణి నందిని, మందాకిని అనే క్యారెక్టర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube