వరుసగా ప్రమాదాలకు గురవుతున్న యువ హీరో లు  

Tollywood Hero\'s Injured In Shooting-

అదేదో ప్రమాదాల సీజన్ లాగా టాలీవుడ్ ఇండస్ట్రీ యువ హీరో లు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు.మొన్నటికి మొన్న మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

Tollywood Hero\'s Injured In Shooting--Tollywood Hero's Injured In Shooting-

అయితే అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రమాదం జరగకుండా వరుణ్ సురక్షితంగా బయటపడ్డాడు లేండీ.ఆ ఘటన మరువకముందే హీరో నాగ శౌర్య షూటింగ్ లో గాయపడ్డాడు.ఫైట్ సీన్ లో డూప్ లేకుండా చేస్తూ నాగ శౌర్య గాయపడినట్లు తెలుస్తుంది.

Tollywood Hero\'s Injured In Shooting--Tollywood Hero's Injured In Shooting-

అయితే అది పక్కన పెడితే నిన్న యువ హీరో సందీప్ కిషన్ కూడా తెనాలి రామకృష్ణ చిత్రీకరణ లో ప్రమాదానికి గురయ్యాడు.ఫైట్ మాస్టర్ సమన్వయ లోపం వల్లే ఈ విధంగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.

అయితే ఈ రోజు తాజాగా శర్వానంద్ కూడా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.బ్యాంకాక్ లో 96 మూవీ షూటింగ్ లో పాల్గొన్న శర్వానంద్ కు కాలికి,భుజానికి తీవ్రంగా గాయాల పాలైనట్లు తెలుస్తుంది.

ట్రైనర్స్ ఆధ్వర్యంలో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న శర్వానంద్ అనుకోకుండా ప్రమాదానికి గురవ్వడం తో భుజం డిస్ లొకేట్ అయ్యినట్లు తెలుస్తుంది.అలానే మోకాలికి కి కూడా గాయం కావడం తో ఆయనకు భుజానికి,మోకాలికి శస్త్రచికిత్స కూడా జరగనున్నట్లు తెలుస్తుంది.ఇలా వరుసగా యువ హీరోలు అందరూ ప్రమాదాలకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది.వరుస పెట్టి యువ హీరోలు అందరూ గాయపడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.