నిన్నటి తరం నటులకు ఆ విషయంలో అన్యాయం జరిగిందా.. ?

సినిమా.ప్రతి ఒక్కరి కల. అది నిన్నటి తరం అని నేటి తరం అనే తేడా ఏమి లేదు.అవకాశం కోసం నాటి నుండి నేటి వరకు అందరు కష్టాలు పడుతున్నవారే.

 Tollywood Heroes From Yesteryear And Present Days, Tollywood, Yesteryear Heroes,-TeluguStop.com

ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి అవకాశం దొరికిన స్టార్స్ గా మారుతారు అనే నమ్మకం లేదు.ఒక వేళా స్టార్స్ గా మారిన కోట్ల రూపాయలు వెనకేస్తారనే నమ్మకం అస్సలే లేదు.

అలాంటి ఇండస్ట్రీ లో అవకాశం కోసం ఎన్నో వేళా మంది ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే మునపటి హీరోలు ఒక ఏడాదికి ఐదు నుండి పది సినిమాలు విడుదల చేసేవారు.

అందుకు గల కారణం అప్పట్లో సినిమాలు 100 రోజుల్లో పూర్తయ్యేవి.అంతే కాదు మూడు నుంచి నాలుగు షిఫ్ట్స్ ఏకకాలంలో పని చేసేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఒక సినిమా మూడేళ్లయినా పూర్తవడం లేదు.

క్వాలిటీ అని.డిజిటల్ అంటూ ఏళ్లకు ఏళ్ళు సాగదీస్తున్నారు.అందుకే ఏడాదిలో ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది చాల పెద్ద విషయం ఇప్పటి రోజుల్లో.ఇక రాజమౌలి వంటి స్టార్స్ ఐదేళ్లయినా సినిమాను పూర్తి చేయని పరిస్థితి.

Telugu Days, Balakrishna, Chiranjeevi, Nt Ramarao, Heroes, Rajamouli, Tollywood,

ఇక నాటి దిగ్గజాలు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి స్టార్స్ ఏటా పది సినిమాలు చేసే రోజుల నుండి నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు ప్రతి ఏడు మూడు నుండి నాలుగు సినిమాలు తీసేవారు.2010 నాటికి ఏడాదికి ఒక్క సినిమా చేస్తే చాలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.ఎన్టీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసిన మూడు నెలల్లో సినిమా తీయడం అప్పట్లో సర్వసాధారణం.

Telugu Days, Balakrishna, Chiranjeevi, Nt Ramarao, Heroes, Rajamouli, Tollywood,

ఇక అప్పటి స్టార్స్ రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎన్ని షిఫ్ట్స్ అయినా పని చేయడానికి సిద్ధంగా ఉండేవారు.30 రోజులు డేట్స్ ఇచ్చిన కూడా కేవలం లక్ష రూపాయలు చేతిలో పెడితే కళ్ళకు అద్దుకునేవారు ఎలాంటి హీరోలైనా.మరి ఇప్పుడు లక్షలకు అసలు విలువే లేదు.

కోట్లల్లో పారితోషకాలు ఇచ్చి సినిమా లాభాల్లో వాటాలు ఇచ్చే కాలం నడుస్తుంది.సినిమా కోసం ఎన్ని ఏళ్ళు అయినా వేచి చూస్తున్నారు ఇప్పటి హీరోలు.50 ఏళ్ళ పాటు హీరోగా కొనసాగిన 25 సినిమాల్లో నటిస్తే గొప్పే అన్నట్టుగా మారింది.అందుకే వారికి తక్కువ పని ఎక్కువ పారితోషకం అన్నట్టుగా సాగుతుంది.

కానీ ముందు తరం అంత కూడా గొడ్డు చాకిరి చేసి తక్కువ పేమెంట్ తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube