మీటూపై మాట్లాడేందుకు తెలుగు హీరోలకు భయం  

  • బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ ఉద్యమం తమిళనాట సింగర్‌ చిన్మయి మొదలు పెట్టింది. ఆమె ప్రముఖ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమిళంకు చెందిన హీరోలు మరియు ఇతర టెక్నీషియన్స్‌ మాత్రం ఆమె ఆరోపణలపై, ఆమె వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఉత్తరాధిన ఉన్నంతగా మీటూ ఎఫెక్ట్‌ సౌత్‌లో కనిపించడం లేదు.

  • Tollywood Heroes Fearing About Supporting The Metoo Movement-

    Tollywood Heroes Fearing About Supporting The Metoo Movement

  • టాలీవుడ్‌లో ఇప్పటి వరకు మీటూ ఉద్యమంపై హీరోలు ఎవరు స్పందించలేదు. కొందరు హీరోయిన్స్‌ మాత్రం లైంగిక వేదింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడాల్సిందే నని, మీటూ ఉద్యమంలో తాము కీలకంగా ఉంటామని ముందుకు వచ్చారు. అయితే హీరోలు ఈ విషయమై మాట్లాడక పోవడంను కొందరు తప్పుబడుతున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ ఈ విషయమై పెద్ద ఎత్తున తమ గళం విప్పుతున్న సమయంలో మీరెందుకు మౌనంగా ఉంటున్నారంటూ కొందరు తెలుగు హీరోలను ప్రశ్నిస్తున్నారు.

  • ఈ సమయంలోనే కొందరు తెలుగు హీరోలు ఈ విషయమై స్పందిస్తే శ్రీరెడ్డి వంటి వారు కొందరు రివర్స్‌ అయ్యే అవకాశం ఉందని, గతంలో మీరు చేసిందేంటి అంటూ ఆరోపించే అవకాశం ఉందని, అందుకే ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మీటూకు మద్దతు తెలిపేందుకు సాహసం చేయడం లేదని తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ మీటూకు మద్దతుగా మాట్లాడినందుకు ఒక మహిళ మీరు చెప్పేవి అబద్దాలు, ఆడవారికి గౌరవం అంటూ మీరు మాట్లాడిన మాటలు నిజం కావు, త్వరలోనే మీ బండారం బయట పెడతానంటూ ప్రకటించింది.

  • Tollywood Heroes Fearing About Supporting The Metoo Movement-
  • ఇలా ఎవరైతే మీటూకు మద్దతుగా ఉంటారో వారి పూర్వ చరిత్ర తవ్వే అవకాశం ఉంది. అందుకే హీరోలు ఎవురు కూడా మాట్లాడేందుకు ఆసక్తిగా లేరు అంటూ ప్రచారం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా మీటూ గురించి విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదంలో ఇంకా ఎంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో అంటూ ఎదురు చూస్తున్నారు.