అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు!

స్టార్ హీరోలకు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరి సినిమాల కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు.

 Tollywood Heroes Fans Waiting Their Movie Updates, Tollywood Heroes, Tollywood H-TeluguStop.com

అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం వారి ఫ్యాన్స్ కు కొన్నాళ్లుగా నిరాశ కలిగిస్తున్నారు.వారి కొత్త సినిమాల నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా వారికి పిచ్చి ఎక్కిస్తున్నారు.

ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు అనే చెప్పాలి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్సీ15.

.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా స్టార్ట్ అయ్యి దడపా 2 ఏళ్ళు పూర్తి అవుతున్న ఇంకా షూట్ పూర్తి కాలేదు.అలాగే ఈ సినిమా నుండి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

దీంతో మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

అలాగే మరో మెగా హీరో అల్లు అర్జున్ సినిమా పరిస్థితి గురించి కూడా మేకర్స్ ఇలాగె కంగారు పడుతూ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ప్రెజెంట్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నాడు.పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యాక ఈ సినిమా పార్ట్ 2 షూట్ ఈ మధ్యనే స్టార్ట్ చేసారు.దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.

భీమ్లా నాయక్ తర్వాత మరో సినిమా రిలీజ్ కాలేదు.వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు కానీ ఈయన షూటింగ్ లో పాల్గొనేది మాత్రం కనిపించడం లేదు.

దీంతో పవర్ స్టార్ నుండి ఒక్క సినిమా అయినా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కానీ ఏ సినిమా రిలీజ్ అప్డేట్ అయితే అందడం లేదు.

Telugu Allu Arjun, Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Heroe

ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయలేదు.చరణ్ అయినా కనీసం సినిమా షూట్ పూర్తి చేస్తున్నాడు.కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ సినిమా అనౌన్స్ చేసి ఏడాది అయినా ఇంకా షూట్ కూడా స్టార్ట్ చేయలేదు.ఈయన సినిమా ఇంత ఆలస్యం అవుతుండడంతో ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Telugu Allu Arjun, Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Heroe

ఇక మహేష్ బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.వీరు కూడా ఈ హీరోల సినిమాల అప్డేట్ ల కోసం ఎదురు చూస్తున్నారు.మహేష్ ప్రెజెంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.సర్కారు వంటి ఘన విజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేసాడు.మరి ఈ సినిమా అప్డేట్ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్.అలాగే ప్రభాస్ చేతిలో 5 పాన్ ఇండియా సినిమాలు ఉన్న ఒక్క సినిమా నుండి కూడా అప్డేట్ అనేది లేదు.

ఇలా ఫ్యాన్స్ అంతా వారి హీరోల అప్డేట్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube