ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోడానికి రకరకాల సినిమాలని చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు కానీ ఏది చేసిన వాళ్ళు ఇమేజ్ పెరిగే విధంగా ఉండాలి అంతే కానీ వల్ల ఇమేజ్ చెడిపోయే విధంగా ఉండకూడదు అని ఆలోచించుకుని హీరోలు చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ ఉంటారు ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోలందరూ వాళ్ల వాళ్ల సినిమాల్లో బిజీగా ఉన్నారు అయితే హీరోలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడంవల్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ల హీరో దగ్గర్నుంచి ఏ సినిమా కావాలి అనేది కోరుకుంటూ ఉంటారు ఒక్కొక్క హీరో కి 12 ప్రాజెక్టు ఉంటుంది.అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మా హీరో చేస్తే బావుంటుంది అని అని అనుకొని ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం……
కోబలి
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో కోబలి అనే సినిమాని అప్పట్లో అనౌన్స్ చేసి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంవల్ల ఆ సినిమా ఆగిపోయింది అయితే ఎప్పటికైనా ఆ సినిమాని పవన్ కళ్యాణ్ తోనే తీస్తానని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సమయంలో తన మనసులోని మాటని బయటపెట్టారు.త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు (జేమ్స్ బాండ్)
జేమ్స్ బాండ్ తరహాలో సినిమా రావాలని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ ఆ తరహా స్టోరీలు మహేష్ బాబుకి వినిపించినప్పటికీ సెట్ అవ్వట్లేదు.
ప్రభాస్ (భక్త కన్నప్ప)
ఒకప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు చేసిన భక్తకన్నప్ప సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఆ సినిమాని మళ్ళీ ప్రభాస్ తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు చూస్తున్నారు కానీ ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలను బట్టి భక్త కన్నప్ప అనేది ఇంకా లేట్ అవ్వచ్చు.కానీ మొత్తానికి అయితే ప్రభాస్ తో భక్తకన్నప్ప సినిమా చేయిస్తాను అని కృష్ణంరాజు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.
పూరి జగన్నాథ్ (జనగణమన)
మహేష్ బాబు కి పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి 2 బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో జనగణమణ సినిమా చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు కానీ మహేష్ బాబు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఎప్పటికైనా జనగణమన అనే సినిమా మహేష్ తో కాకపోయినా వేరే వాళ్ళతో నేను తీసి రిలీజ్ చేస్తానని పూరి జగన్నాథ్ చెప్తున్నారు.
రాజమౌళి (మహాభారతం)
బాహుబలి సినిమా తో తన స్టామినా ఏంటో ఇంటర్నేషనల్ గా ప్రూవ్ చేసుకున్న దర్శకధీరుడు రాజమౌళి ఎప్పటికైనా తన కెరియర్ లో మహాభారతాన్ని తీస్తాను అని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు తాను ఎప్పుడు తీస్తారు అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే మహాభారతం అనేది చాలా పెద్ద స్టోరీ దాన్ని తియ్యాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి తన చివరి సినిమాగా మహాభారతాన్ని తీస్తానని రాజమౌళి చెప్పారు.
రామ్ చరణ్ (జగదేకవీరుడు అతిలోకసుందరి)
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్ గా వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎప్పటికైనా రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు కానీ రామ్ చరణ్ కి ఉన్న కమిట్మెంట్స్ వలన సినిమా అనేది పట్టాలెక్కలేదు.ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు తమ అభిమాన నటుడు అయిన చిరంజీవి చేసిన ఆ పాత్రను ఆయన కొడుకు అయిన రామ్ చరణ్ ఎలా చేస్తారు అని చూడడానికి మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ (దాన వీర శూర కర్ణ)
ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించాడు అందులో భాగంగా ఆయన తీసిన దానవీరశూరకర్ణ సినిమా మంచి విజయాన్ని సాధించి ఎన్టీఆర్ ని నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కించింది అలాంటి సినిమాని సీనియర్ ఎన్టీఆర్ మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు మొన్నటిదాకా ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలో చేయగలడా లేదా అనే సందేహం ఉండేది కానీ ఎప్పుడైతే యమదొంగ సినిమా తో యముడిగా ఎన్టీఆర్ తన ప్రతిభను జనానికి చూపించాడో అప్పటి నుంచి దాన వీర శూర కర్ణ సినిమాని ఎన్టీఆర్ ఎప్పుడు చేస్తాడా అని అతని ఫ్యాన్స్ తో పాటు జనాలు కూడా ఎదురుచూస్తున్నారు.ఇవి ఒక్కొక్క హీరో మరియు దర్శకులకు ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ ……
.