ఒకే రూట్లో టాలీవుడ్ హీరోలు.. భలే ప్లాన్ వేసారే?

సినిమా రంగుల ప్రపంచంలో సక్సెస్ ని బట్టే స్టార్ డమ్ డిసైడ్ అవుతూ ఉంటుంది.మంచి స్టార్ డమ్ ఉన్నప్పుడే వరుస సినిమాలతో దూసుకుపోవాలని ప్రతి హీరో భావిస్తుంటాడు.

 Tollywood Heroes Continuous Movies Pawan Kalyan Prabhas Raviteja Chiranjeevi Details, Tollywood Heroes ,continuous Movies ,pawan Kalyan ,prabhas ,raviteja, Chiranjeevi, Bheemla Nayak, Hari Hara Veera Mallu, Khiladi, Radhe Shyam, Acharya-TeluguStop.com

ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు అందరూ కూడా ఇదే రూట్ లో వెళ్తున్నారు అనేది తెలుస్తుంది.ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో తగ్గేదేలేదు అన్నట్లుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

ఎవరు ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

 Tollywood Heroes Continuous Movies Pawan Kalyan Prabhas Raviteja Chiranjeevi Details, Tollywood Heroes ,continuous Movies ,pawan Kalyan ,prabhas ,raviteja, Chiranjeevi, Bheemla Nayak, Hari Hara Veera Mallu, Khiladi, Radhe Shyam, Acharya-ఒకే రూట్లో టాలీవుడ్ హీరోలు.. భలే ప్లాన్ వేసారే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు కాస్త స్లో గానే సినిమాలు చేసేవారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

కానీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.ఒక్కో సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ వసూలు చేసే పవన్ కళ్యాణ్ కోసం దర్శక నిర్మాతలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండడంతో ఇప్పటికే ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా మారిపోయారు ఆయన.భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సహా మరో రెండు సినిమాలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

ఒక్కో సినిమాకి ప్రభాస్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన దర్శక నిర్మాతలు ఇంత మొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైపోతున్నారు.

దీంతో ప్రస్తుతం రాధేశ్యామ్ విడుదల కు సిద్దంగా ఉండగా తర్వాత సలార్, ఆది పురుష్ ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.ఇక మారుతి తో కూడా ఓ సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు అంటూ టాక్ కూడా ఉంది.

క్రాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మరోసారి ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

కిలాడి, ధమాకా,రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి సినిమాలతో బిజీ బిజీగా మారిపోయాడు మాస్ మహారాజా రవితేజ.

60 ఏళ్లు దాటి పోతున్నా అటు మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు.ఇప్పటికే కొరటాల శివ తో ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.మెగాస్టార్ కూడా రెమ్యునరేషన్ భారీగానే పెంచేసాడట.

ఇక వీరితో పాటు నాచురల్ స్టార్ నాని,మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా త్వరలో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tollywood Hero Back to Back Movies #tollywoodheroes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube