హీరోలూ ఇకనైనా రిస్క్ తీసుకోండయ్యా !

Tollywood Heroes Are Saying No For Experimental Movies

జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అంటారు.ఈ మాట అక్షర సత్యం కూడా.

 Tollywood Heroes Are Saying No For Experimental Movies-TeluguStop.com

ఇక కళల విషయంలో ఈ మాట అచుగుద్దినట్టు సరిపోతుంది.ఎందుకంటే తరం మారే కొద్దీ ప్రేక్షకులు మారతారు.

వారు అభిరుచి మారుతుంది.వీరికి అనుగుణంగా కళ కూడా రూపాంతరం చెందాలి.

 Tollywood Heroes Are Saying No For Experimental Movies-హీరోలూ ఇకనైనా రిస్క్ తీసుకోండయ్యా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సినిమా ఏమి మినహాయింపు కాదు.

ప్రస్తుతం అన్నీ సినీ పరిశ్రమలలో మేకర్స్ రిస్క్ చేస్తున్నారు.

కొత్త కొత్త ప్రయోగాలకి శ్రీకారం చుడుతున్నారు.మలయాళంలో ఈ మార్పు ఎప్పుడో వచ్చింది.

కర్ణాటకలో చిన్న సినిమాలు బతికేది, బతుకుతుంది కూడా ఇలాంటి ప్రయోగత్మక సినిమాల కారణంగానే.తమిళంలో సూర్య లాంటి స్టార్ హీరో ఈ బాధ్యతని తన భుజాన వేసుకున్నాడు.

తాజాగా ఓటీటీలో విడుదలైన జై భీమ్ మూవీ కూడా ఇలాంటి ప్రయోగంలో భాగంగా బయటకి వచ్చిన చిత్రమే.కానీ.

, జై భీమ్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక బాలీవుడ్ లో అయితే ప్రయోగత్మక చిత్రాలకి లోటు ఉండదు.

అక్కడి టాప్ స్టార్ అక్షయ్ కుమార్ ప్యాడ్ మేన్ లాంటి సినిమాలు చేస్తున్నారంటే బాలీవుడ్ ఎంతలా కొత్తదనం వైపు పరుగులు తీస్తుందో అర్ధం చేసుకోవచ్చు.కానీ., ఈ విషయంలో మన తెలుగు సినిమా పరిస్థితి ఏమిటి? దీనికి సమాధానం మాత్రం సున్నా అనే చెప్పుకోవాలి.

Telugu Akshay Kumar, Balakrishna, Chiranjeevi, Surya, Jai Bhim, Pad, Telugu, Tollywood, Tollywood Heros-Movie

ఎందుకంటే మన స్టార్ హీరోలు, స్టార్ మేకర్స్ రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా ఉండరు.అలాంటప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కడ నుండి వస్తాయి? నిజం చెప్పాలంటే మన తెలుగు హీరోలకు రిస్క్ అంటే భయం.తమిళ హీరో సూర్య ‘జై భీమ్’ సినిమా తీస్తే మెచ్చుకుంటారు గానీ, తాము ప్రేరణ పొంది అలాంటి కొత్త కథలను, విభిన్న చిత్రాలను చేయాలని మన స్టార్ హీరోలకు ఆలోచన కలగదు.ఎందుకయ్యా అంటే ? ఏం చెబుతాం.మన హీరోలకు కమర్షియల్ సినిమాలు అంటేనే నమ్మకం.

కానీ, రిస్క్ లేనిది గొప్ప విజయం రాదు అని అర్థం చేసుకోరు.

Telugu Akshay Kumar, Balakrishna, Chiranjeevi, Surya, Jai Bhim, Pad, Telugu, Tollywood, Tollywood Heros-Movie

నిజానికి తెలుగులో ఇలాంటి ప్రయోగాలు మన పాత తరం స్టార్స్ ఎప్పుడో చేశారు.యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఆరోజుల్లో.మిగతా ఇండస్ట్రీలు మనలని ఆదర్శంగా తీసుకునేవి.

తరువాత కాలంలో చిరంజీవి, బాలకృష్ణ కూడా తమ వంతుగా కాస్త ప్రయత్నాలు చేశారు.కానీ.

, ఈ తరం స్టార్స్ మాత్రం రిస్క్ చేయడానికి సాహసించడం లేదు.మరి.ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Balakrishna #Pad #Akshay Kumar #Chiranjeevi #Surya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube