తెలుగు హీరోలకు జరిగిన అవమానాల గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే !

సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరు గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ తో రారు ఒకవేళ వచ్చినా, వచ్చిన తర్వాత అయినా కూడా కష్టాలు పడాల్సిందే.ఇక మన తెలుగు హీరోలలో ఒక్కొక్కరు ఒక్కోరకమైన అనుభవాలను గడించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు అలా నిలదొక్కుకున్న వారే అగ్ర హీరోలుగా కొనసాగారు నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చిరంజీవి వరకు అవమానాలు పడని హీరోలు లేరంటే నమ్మండి.

 Tollywood Heroes And Their Early Days Struggles,tollywood Heroes,senior Ntr,anr,-TeluguStop.com

వారి అనుభవాలను కచ్చితంగా తెలుసుకుంటేనే ఈ తరం నటీనటులు కాస్త స్ఫూర్తి పొందుతారు.ఇక కొంతమంది స్టార్ హీరోలు తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలు అవమానాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Telugu Gemini Ganesan, Kamal Haasan, Rajinikanth, Ramakrishna, Senior Ntr, Shobh

సీనియర్ ఎన్టీఆర్.ఈయన యువకుడుగా ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.తనకు టిఫిన్ ఎక్కువ పెట్టించాలంటూ నిర్మాతను బ్రతిమిలాడుకున్న రోజుల నుంచి వేల కోట్ల ఆస్తులు సంపాదించే హీరోగా ఎదిగాడు.నలుగురు ఐదుగురు కలిసి ఒక రూమ్ లో ఉంటూ రేషన్ ఫుడ్ తింటూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు స్టూడియోలో చుట్టూ సైకిల్ తో రౌండ్లు కొట్టేవాడు.

Telugu Gemini Ganesan, Kamal Haasan, Rajinikanth, Ramakrishna, Senior Ntr, Shobh

ఇక అక్కినేని విషయానికొస్తే ఆయనది ఒక పేద వ్యవసాయ కుటుంబం.సినిమాల్లో నటిస్తే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని అక్కినేని నాగేశ్వరరావుని అతని అన్నయ్య సినిమాల్లో నటించడానికి పంపించాడు.అక్కినేని అంత అందగాడు కాదు, ఆరడుగుల ఆజానుబాహుడు కాదు.సినిమా యూనిట్లో ఒక అసిస్టెంట్ అవమానిస్తే i will complete you అంటూ తప్పు తప్పుగా ఇంగ్లీష్ మాట్లాడట ఈ విషయాన్ని తానే ఇంటర్వ్యూలో చెప్పాడు.

Telugu Gemini Ganesan, Kamal Haasan, Rajinikanth, Ramakrishna, Senior Ntr, Shobh

ఇక రజనీకాంత్ కూడా కండక్టర్ గా ఉద్యోగం మానేసి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకుతున్న క్రమంలో ఎవరు అవకాశం ఇవ్వకపోవడంతో ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాడట.

Telugu Gemini Ganesan, Kamal Haasan, Rajinikanth, Ramakrishna, Senior Ntr, Shobh

అలనాటి హీరో రామకృష్ణ ఒకవైపు నటుడుగా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్న హీరోల యొక్క బట్టలు కుట్టుతూ జీవనం సాగించారట ఆ తర్వాత హీరోగా ఎదిగి గీతాంజలి అనే మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు రామకృష్ణ.

Telugu Gemini Ganesan, Kamal Haasan, Rajinikanth, Ramakrishna, Senior Ntr, Shobh

కమల్ హాసన్ సైతం ఈ కష్టాలకు అతీతుడు ఏమీ కాదు.తన కుటుంబం ఎంతో మంచి స్థానంలో ఉన్నా కూడా సినిమాల్లో అవకాశాలు లభించేంతవరకు డాన్స్ మాస్టర్ గా పనిచేశాడు.ఇక మహానటి సావిత్రి భర్త జెమినీ గణేషన్ కూడా జెమినీ స్టూడియోలో అకౌంటెంట్ గా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే.

Telugu Gemini Ganesan, Kamal Haasan, Rajinikanth, Ramakrishna, Senior Ntr, Shobh

శోభన్ బాబు ఏకంగా చెన్నైలో పదేళ్లపాటు హీరోగా నటించడానికి ఎన్నో అష్ట కష్టాలు పడ్డాడు భార్య ముగ్గురు పిల్లలతో ఓ గదిలో అద్దెకు ఉంటూ హీరోగా నిలదొక్కుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఎంతో మంది చేతిలో అవమానాలకి గురయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube