ఆ దర్శకుడు చనిపోవడంతో చాలా బాధ పడ్డాను...

తెలుగులో ఫలక్నామా దాస్ అనే చిత్రంలో హీరోగా నటించి తన మాస్  నటనతో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆ మధ్య విశ్వక్ సేన్ హీరోగా నటించిన “హిట్ – ది ఫస్ట్ కేస్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది.

 Tollywood Hero Vishwak Sen About Director Konda Rajesh Death-TeluguStop.com

దీంతో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో విశ్వక్ సేన్ పాల్గొని తన మొదటి చిత్రంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో తాను 2017వ సంవత్సరంలో వచ్చిన “వెళ్ళిపోమాకే” అనే చిత్రంలో నటించడానికంటే ముందుగా ఓ చిన్న తరహా బడ్జెట్ చిత్రంలో హీరోగా నటించానని చెప్పుకొచ్చాడు.కానీ అనుకోకుండా ఆ చిత్రం విడుదల కాలేదని అలాగే ఆ చిత్ర పేరుని బయట పెట్టడానికి కూడా విశ్వక్ సేన్ ఇష్ట పడలేదు.

 Tollywood Hero Vishwak Sen About Director Konda Rajesh Death-ఆ దర్శకుడు చనిపోవడంతో చాలా బాధ పడ్డాను…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ఉన్నట్లుండి సినిమా నుంచి తప్పుకున్నాడని దాంతో కొండ రాజేష్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించేందుకు ముందుకు వచ్చాడని తెలిపాడు.

అయితే మంచి ప్రతిభ ఉన్నటువంటి కొండ రాజేష్ ఈ చిత్ర క్లైమాక్స్ మరియు ఇతర సన్నివేశాలను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పుకొచ్చాడు.

కానీ అనుకోకుండా నిర్మాతతో వచ్చిన గొడవ కారణంగా కొండ రాజేష్ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆ తర్వాత ఏమైందో ఏమో కొన్ని రోజులకే అతడు మరణించాడని చెప్పుకొచ్చాడు. ఎంతో ప్రతిభ ఉన్నటువంటి కొండ రాజేష్ మరణించడంతో తాను చాలా బాధపడ్డానని కూడా తెలిపాడు.

కానీ ఆ తర్వాత ఆ చిత్రం విడుదల ఆగిపోయిందని కానీ నిర్మాత కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు…

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విశ్వక్ సేన్ తెలుగులో పాగల్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు “నరేష్ కుప్పిలి” దర్శకత్వం ఇస్తున్నాడు.

 అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్ “నివేద పేతురాజ్” నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.

కాగా నూతన దర్శకుడు విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న “గామి” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

#TollywoodHero #TeluguHero #Vishwak Sen #Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు