దెబ్బకు పత్తా లేకుండా పోయిన వరల్డ్ ఫేమస్ లవర్‌...

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాలో నటించి రాత్రికి రాత్రే స్టార్ హీరో  ఫేమ్ ని సంపాదించినటువంటి విజయ్ దేవరకొండ అందరికీ బాగానే గుర్తుంటాడు.అంతేగాక విభిన్న కథనాలు పెంచుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ.

 Tollywood Hero Vijay Devarakonda Latest News-TeluguStop.com

అయితే తాజాగా విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో నటించాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు.

అలాగే చిత్రానికి ప్రముఖ సినీ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించారు.

అయితే ప్రపంచ వ్యా ప్తంగా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైనది.

అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన  ఈ చిత్రం విజయ్ దేవరకొండ అంచనాలను ఏ  మాత్రం అందుకోలేకపోయింది.అంతేగాక ఈ చిత్రం లోని మొదటి భాగం ప్రేక్షకులని బాగానే అలరించినప్పటికీ రెండో భాగం మాత్రం తుస్సుమంది.

దీంతో ఈసారి  విజయ్ దేవరకొండ కి బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు.అయితే ఈ చిత్ర ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ బాగానే కష్టపడినప్పటికీ కథనంలో సరైన ఎలివేషన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినట్లు తెలుస్తోంది.

దీంతో విజయ్ దేవరకొండ మీడియా ముందుకు రావడమే మానేశాడు.దీంతో కొన్ని మీడియా వర్గాలు విజయ్ దేవరకొండకు ఏమైందా అని ప్రశ్నిస్తున్నాయి.

Telugu Rashi Khanna, Lover-Movie

అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్న టువంటి “ఫైటర్” చిత్రంలో నటిస్తున్నాడు.ఇందులో విజయ్ దేవరకొండ బాక్సింగ్ ఫైటర్ గా కనిపిస్తాడు.అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ స్టార్ హీరో కూతురు అనన్య పాండే నటిస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ముంబై నగర పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube