కర్నూలు ఓటర్ లిస్టులో ప్రముఖ టాలీవుడ్ హీరో ఫోటో హల్ చల్...

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపయోగించే ఓటర్ ఐడీ కార్డులో తప్పులు ఏమైనా ఉంటే సరి సరిదిద్దుకోవాలని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

 Tollywood Hero Victory Venkatesh Photo In The Kurnool Voter List-TeluguStop.com

అయితే తాజాగా కర్నూలు  జిల్లాల్లోని ఓ గ్రామంలో పంచాయతీ ఎన్నికల నిమిత్తమై విడుదల చేసినటువంటి ఓటర్ లిస్టులో టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ఓటు హక్కు కలిగి ఉండటం, అది కూడా ఓ మహిళ పేరుతో ఓటు హక్కు కలిగి ఉండటం విస్మయానికి గురిచేస్తుంది.

అయితే ఈ విషయాన్ని వెంటనే ఓటరు అధికారులు గమనించి పొరపాటు జరిగిందని సరిదిద్దుకునే లోపే ఓటర్ లిస్టు ఫోటోలు సోషల్ మీడియాలోకి వెళ్లిపోయాయి.

దీంతో నెటిజనులు ఈ ఫోటోలను బాగానే చేస్తున్నారు.అయితే విక్టరీ వెంకటేష్ అభిమానులు మాత్రం ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఓ మహిళ ఓటర్ కి తమ అభిమాన నటుడు విక్టరీ వెంకటేష్ ఫోటో ని ఎలా అనుసంధానించి ఓటర్ కార్డు జారీ చేస్తారని మండి పడుతున్నారు.అయితే ఎన్నికల ఓటర్ల లిస్టులో ఇలా తప్పులు దొర్లడం కొత్తేమీ కాదు.

గతంలో కూడా ఓ వ్యక్తి ఓటర్ లిస్టులో తన ఫోటో కి బదులుగా కుక్క ఫోటో ప్రత్యక్షమైంది.దీంతో ఒక్కసారిగా ఆ ఓటర్ ఖంగుతిన్నాడు.

అయితే వెంటనే అధికారులు స్పందించి ఈ పొరపాటును సరిదిద్దుకున్నారు.అయితే విక్టరీ వెంకటేష్ విషయంలో కూడా ఎక్కడో పొరపాటు జరిగిందని క్షమించాలని అధికారులు కోరారు.

Telugu Tollywood, Venkatesh-Movie

అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్ప అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ చిత్రం తమిళంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినటువంటి అసురన్ చిత్రానికి తెలుగులో నారప్ప అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube