వరుణ్ తేజ్ గనికి కూడా కరోనా దెబ్బ తప్పేలా లేదు... రిలీజ్ వాయిదా పడే అవకాశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది కరోనా కంటే ముందుగానే ఈ సినిమాని స్టార్ట్ చేశారు.

 Tollywood Hero Varun Tej Ghani Movie Release Face Corona Second Wave Impact-TeluguStop.com

అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిపోయింది.మళ్ళీ డిసెంబర్ లో తిరిగి షూట్ స్టార్ట్ చేశారు.

అయితే ఓ మూడు నెలలు కరెక్ట్ గా షూట్ చేశారో లేదో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ సినిమా షూటింగ్ కి విఘాతం కలిగించింది.సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

 Tollywood Hero Varun Tej Ghani Movie Release Face Corona Second Wave Impact-వరుణ్ తేజ్ గనికి కూడా కరోనా దెబ్బ తప్పేలా లేదు… రిలీజ్ వాయిదా పడే అవకాశం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇప్పట్లో మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ చేసే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది.వరుణ్ తేజ్ ఈ మూవీ చేస్తూనే మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు.

ఆ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయింది.అయితే గని ఇంకా 30 శాతం షూటింగ్ ఉంది.

జులై 30న సినిమా రిలీజ్ అని గతంలో ప్రకటించారు.అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే మళ్ళీ షూటింగ్ జులైలో కూడా స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు.

ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడటం పక్కా అని తెలుస్తుంది.ఈ విషయాన్ని రెండు, మూడు లలో చిత్ర నిర్మాతలు నేరుగా ప్రకటించే అవకాశం ఉందని బోగట్టా.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.అలాగే బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

ఈ బ్యూటీ గని మూవీతో పాటు అడవి శేష్ కి జోడీగా మేజర్ మూవీలో నటిస్తుంది.మొత్తానికి కరోనా కష్టకాలం మెగా హీరో వరుణ్ తేజ్ కి చాలా ఇబ్బందికరంగా తయారైంది అని మాత్రం తెలుస్తుంది.

#KannadaStar #Corona Effect #CoronaSecond #Producers #Upendra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు