ఓ ఇంటివాడైన ప్రముఖ టాలీవుడ్ హీరో తిరువీర్.. క్యూట్ కపుల్ అంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు తిరువీర్( Actor Thiruveer ) కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

మసూద సినిమాతో తిరువీర్ ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు.

మసూద సినిమా( Masooda Movie )కు ముందు తిరువీర్ కొన్ని సినిమాలతో పాటు, ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లలో నటించారు.అయితే ఆ సమయంలో తిరువీర్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

అయితే తిరువీర్ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యారు. తిరువీర్ భార్య పేరు కల్పనారావు( Kalpana Rao ) కావడం గమనార్హం.

ఆదివారం రోజున కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య తిరువీర్ పెళ్లి వేడుక( Actot Thiruveer Marriage ) జరిగింది.తిరువీర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తిరువీర్ సోషల్ మీడియా వేదికగా కొత్త ఆరంభం అంటూ హల్దీ వేడుక, పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.

తిరువీర్ మొదట థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.థియేటర్ ఆర్టిస్ట్ గా 150కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన తిరువీర్ బొమ్మల రామారం( Bommala Ramaram ) అనే సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ ను మొదలుపెట్టారు.ఘాజీ, ఏ మంత్రం వేశావే, మల్లేశం( Mallesham ) సినిమాలలో తిరువీర్ చిన్న పాత్రలలోనే నటించినా ఆ సినిమాలు అతనికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

కొన్ని సినిమాలలో తిరువీర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో సైతం నటించారు.

ప్రస్తుతం తిరువీర్ ఒక సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్( Socio Fantasy Movie ) లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి తిరువీర్ స్వస్థలం కాగా తిరువీర్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పె్ళ్లి ఫోటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.తిరువీర్ భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

తిరువీర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.తిరువీర్, కల్పన జోడీ చూడముచ్చటగా ఉందని ఈ జోడీ క్యూట్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు