ఇదేం కాంబినేషన్: బాలయ్య బాబుకి విలన్ గా సునీల్...

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి ఇప్పటికీ సరైన స్పష్టత రావడం లేదు.

 Tollywood Hero Sunil Will Play Villain Role In Balayya Babu Movie-TeluguStop.com

దాంతో బాలయ్య బాబు అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ నటించే అవకాశం కొట్టేశాడు.

అయితే సునీల్ పాత్ర పై ఇప్పటికీ దర్శకుడు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు చిత్ర యూనిట్ సభ్యులు.దీంతో నెట్టింట్లో ఈ చిత్రంలో సునీల్ పాత్ర పై పలు కథనాలు హల్చల్ చేస్తున్నాయి.

ఈ చిత్రంలో సునీల్ విలన్ పాత్ర చేస్తున్నాడని, ప్రముఖ విలన్ గా సీనియర్ నటుడు శ్రీకాంత్ ఇప్పటికే ఖాయం కాగా రెండో విలన్ గా సునీల్ కొనసాగుతున్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి.అయితే ఏదేమైనప్పటికీ విలన్ పాత్రలో ఇప్పటికే సునీల్ డిస్కో రాజా చిత్రంలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు.

అంతే కాక సినీ విమర్శకుల నుంచి నటన పరంగా పలు ప్రశంసలు కూడా అందుకున్నాడు.అయితే బోయపాటి శ్రీను కూడా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సునీల్ నీ విలన్ నటింపజేసేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాకపోతే ఈ విషయంపై బోయపాటి శ్రీను ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Telugu Balakrishna, Sunil, Sunil Latest-Movie

అయితే ఇది ఇలా ఉండగా డిస్కో రాజా లో విలన్ పాత్ర చేసినటువంటి సునీల్ ని ఇప్పటికే పలువురు దర్శక, నిర్మాతల నుంచి విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం.అయితే ఇప్పటివరకు కమెడియన్ గా హీరోగా పలు విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులని మెప్పించిన టువంటి సునీల్ విలన్ గా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube