స్క్రిప్ట్ వినకుండా ఒకే చెప్పిన రామ్.. ఎందుకంటే?

మామూలుగా ఏ స్టార్ హీరో అయినా తమ ప్రాజెక్టు స్క్రిప్ట్ ను వినకుండా ఉండరు.ఒకవేళ అలా వినకుండా ఉంటే ఆ సినిమా ప్లాఫ్ అవుతుందన్న భయంతో ముందుగానే కథను వింటారు.

 Tollywood Hero Ram Pothineni Satisfied With Linguswamy Scrip-TeluguStop.com

ఇక నచ్చితే ఓకే చేస్తారు లేదంటే వదిలేస్తారు.అంతే కానీ కథను వినకుండా మాత్రం ఏ హీరో లైనా సినిమాలో నటించడానికి ముందుకు రారు.

కానీ మరో యంగ్ హీరో రామ్ మాత్రం స్క్రిప్ట్ వినకుండానే సినిమాకు ఓకే చెప్పాడట.ప్రస్తుతం ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 Tollywood Hero Ram Pothineni Satisfied With Linguswamy Scrip-స్క్రిప్ట్ వినకుండా ఒకే చెప్పిన రామ్.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రామ్.అంతేకాకుండా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాను రెండు భాషల్లో తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా కంటే ముందు కొన్ని ప్లాఫ్ లను అందుకున్న రామ్ అలాంటివి మళ్లీ ఎదురుకాకుండా సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ ను ప్రకటించాడు రామ్.ఈ సినిమా స్క్రిప్టు వినకుండానే ఓకే చెప్పినట్లు తెలిపాడు.

Telugu Linguswamy Script, Ram Pothineni, Satisfied, Tollywood-Movie

ఇక ఈ విషయం పట్ల ఆయన అభిమానులు తెగ ఆశ్చర్యపోతున్నారు.స్క్రిప్టు వినకుండా ప్రాజెక్టు ఓకే ఎలా చెప్పాడు ఒకవేళ ఆ సినిమా హిట్ కాకపోతే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.దీంతో గతంలో లింగస్వామి ఓ లైన్ చెప్పడంతో వెంటనే ఓకే అన్నాడట రామ్.ఇక లింగుస్వామి కూడా ఈ సినిమా కథను పూర్తి చేశాడట.మొత్తానికి రామ్ ఈ సినిమాలో నటించడానికి ముందుకు రాగా ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో తమిళ స్టార్ హీరో మాధవన్ నటించనున్నట్లు తెలుస్తుంది.మరి స్క్రిప్ట్ విననందుకు ఈ సినిమా రామ్ కు ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

#Ram Pothineni #Satisfied

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు