సమయం వృథా చేయడమంటే... దానిని వృథా చేసినట్లే.. చరణ్ కామెంట్స్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత ఆయన నటించిన సినిమా ఆచార్య.RRRఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆచార్యతో కూడా మరో హిట్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు.

 Tollywood Hero Ram Charan Comments Viral , Tollywood , Ram Charan , Comments Vir-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 29 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ పలు విషయాల గురించి ముచ్చటించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగానని, ఆయన కొన్ని సార్లు షూటింగ్లకు తనను తీసుకెళ్ళే వారని తెలిపారు.ఇలా చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగటం వల్ల ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాను.

అలాగే సమయం వృధా చేయకూడదనే విషయాన్ని కూడా తెలుసుకున్నానని రామ్ చరణ్ వెల్లడించారు.ఇలా నాన్నతో పాటు షూటింగులకు వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయం ఏమిటంటే సమయం వృధా చేయడం అంటే డబ్బును వృధా చేసినట్లేనని నాన్నను చూసి ఈ విషయాన్ని గ్రహించానని రామ్ చరణ్ వెల్లడించారు.

Telugu Acharya, Pooja Hegde, Ram Charan, Rrr, Time Waste, Tollywood-Movie

ప్రస్తుత కాలంలో ఒక సీన్ చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అందుకే లొకేషన్ కి వెళ్ళగానే సెట్లో సమయం వృధా చేస్తూ ఉండటం వల్ల తీవ్ర స్థాయిలో నిర్మాతలు నష్టపోవాల్సి ఉంటుంది.ఇలా ప్రస్తుతం ఒక 10 నిమిషాలు పాటు సమయం వృధా చేస్తే నిర్మాతకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.మన కోసం సెట్ లో ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎదురుచూస్తూ ఉంటారు.

ఇలా మన కోసం అంతమంది ఎదురుచూస్తున్న సమయంలో మనం ఆలస్యంగా వెళ్ళకూడదు.అందుకే తాను కరెక్ట్ టైంకి ఎప్పుడు షూటింగ్ లో ఉంటానని, సమయాన్ని వృధా చేయనని రామ్ చరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube