లాక్ డౌన్ లో సిక్స్ ప్యాక్ బాడీ పెంచిన నవదీప్… కానీ…  

Hero navdeep Six pack body viral photo, Navdeep, Tollywood hero, Six pack body photos, Tollywood - Telugu Hero Navdeep Six Pack Body Viral Photo, Navdeep, Six Pack Body Photos, Tollywood, Tollywood Hero

తెలుగులో ప్రముఖ దర్శకుడు దేశ తేజ దర్శకత్వం వహించిన “జై” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన యంగ్ హీరో నవదీప్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నవదీప్ తన సినీ కెరీర్లో ఒక పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి ప్రేక్షకులని బాగానే అలరించాడు.

TeluguStop.com - Tollywood Hero Navdeep Six Pack Body Photos Viral Social Media

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.దీంతో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి అందుబాటులో ఉంటున్నాడు.

TeluguStop.com - లాక్ డౌన్ లో సిక్స్ ప్యాక్ బాడీ పెంచిన నవదీప్… కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా నవదీప్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫోటోని షేర్ చేశాడు.  అయితే ఈ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే నవదీప్ సిక్స్ ప్యాక్ బాడీతో గుర్రం పక్కన నిలబడి ఇచ్చిన ఫోజు సూపర్ గా ఉంది.

అలాగే ఈ ఫోటో గురించి నవదీప్ స్పందిస్తూ తాను సంవత్సరం క్రితం తన సిక్స్ ప్యాక్ బాడీతో ఈ ఫోటో షూట్ చేశానని తెలిపాడు.  అయితే ఈ ఫోటోని షేర్ చేసిన ఏడు గంటల లోపే దాదాపు 50 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

***

దీంతో కొంతమంది నవదీప్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే షేర్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నవదీప్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే “అదిరింది” అనే కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

 అలాగే తమిళ భాషలో తెరకెక్కుతున్న వీరమ దేవి అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

#SixPack #HeroNavdeep #Navdeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Hero Navdeep Six Pack Body Photos Viral Social Media Related Telugu News,Photos/Pics,Images..