Ravi Teja Dhee Dance 14 : ఢీ డాన్స్ షోకి గెస్ట్ గా రవితేజ.. షోలో మాస్ మహారాజా రచ్చ రచ్చ?

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ పేరు వినగానే ముందుగా ఆయన ఎనర్జీ గుర్తుకు వస్తూ ఉంటుంది.

 Tollywood Hero Mass Maharaja Ravi Teja On Dhee Dance 14 Grand Finale Episode , T-TeluguStop.com

మన మాస్ మహారాజా రవితేజకు తెలుగులో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మాస్ మహారాజా రవితేజ ఈటీవీలో ప్రసారమవుతున్న బిగ్ రియాలిటీ షో ఢీ కీ వచ్చారు.

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలతో దూసుకుపోతున్నారు మాస్ మహారాజా రవితేజ.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.రవితేజ నటిస్తున్న ధమాకా సినిమా కూడా రిలీజ్ కి సిద్ధం కానుంది.అయితే ఢీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి హాజరు కాబోతున్న విషయాన్ని ఇటీవలే మల్లెమాల కన్ఫామ్ చేసి అందుకు సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేసింది.

ఢీ డాన్స్ 14 గ్రాండ్ ఫైనలికి రవితేజ అతిధిగా రాబోతున్నారు.ఇప్పటికే ఎంతోమంది స్టార్లు ఈ ఢీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ముఖ్య అతిథులుగా పాల్గొన్న విషయం తెలిసిందే.

కాగా ఢీ గత సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే.

దాంతో అభిమానులు ఎప్పుడెప్పుడు అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు.మాస్ మహారాజా రవితేజ ఢీ 14 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి వస్తున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రవితేజ అభిమానులు పూర్తి ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మరి ఢీ షోలో మాస్ మహారాజా ఎంత యాక్టివ్ గా ఉండబోతున్నారు ఎలా రచ్చ రచ్చ చేయబోతున్నారు అన్న విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

ఇకపోతే రవితేజ విషయానికి వస్తే ఇప్పటికే రవితేజ నటించిన ధమాకా సినిమా నుంచి విడుదల అయిన పాటలు యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టి విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube