రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మనోజ్.. ఏమన్నారంటే..?

యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.మొదటి భార్య ప్రణతితో మనోజ్ విడిపోగా ఇప్పటికే విడాకులు కూడా మంజూరయ్యాయి.

 Tollywood Hero Manchu Manoj Reaction About Second Marriage Rumours-TeluguStop.com

మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని.మోహన్ బాబు ఫ్యామిలీ బంధువుల కుటుంబానికి చెందిన అమ్మాయితో మంచు మనోజ్ వివాహం జరగనుందని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే రోజురోజుకు ఈ ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇటీవల విడుదలైన జాతిరత్నాలు ట్రైలర్ లోని బ్రహ్మానందం పంచ్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పెట్టడంతో పాటు తన పెళ్లి డేట్, టైమ్ కూడా మీరే చెప్పండి అంటూ పంచ్ వేశారు.మంచు మనోజ్ వేసిన పంచ్ తో రెండో పెళ్లి వార్తలు నిజం కాదని తెలుస్తోంది.

 Tollywood Hero Manchu Manoj Reaction About Second Marriage Rumours-రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మనోజ్.. ఏమన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మనోజ్ ట్వీట్ లో పూర్తిగా స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Aham Brahmasmi, Comments Viral, Manchu Manoj, Netizens, Pranathi, Rumours, Second Marriage, Social Media, Srikanth Reddy-Movie

గతంలో నెటిజన్ మనోజ్ ను రెండో మ్యారేజ్ చేసుకుంటున్నారా.? అని ప్రశ్నించగా మనోజ్ వామ్మో అంటూ నెటిజన్ కు బదులిచ్చారు.ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఇతర సెలబ్రిటీల సెకండ్ మ్యారేజ్ కు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే అలా వైరల్ అవుతున్న వార్తల వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు.

మరోవైపు గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు.మనోజ్ స్టార్ హీరోల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

#Srikanth Reddy #Second Marriage #Manchu Manoj #Social Media #Aham Brahmasmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు