ఈసారి యాక్షన్ హీరో తో వస్తున్న సంపత్ నంది...  

Tollywood Hero Gopichand New First Look Release Date Is Fixed-gopichand Latest News,gopichand New Movie Update,gopichand News,hero Gopichand New Movie Update,sampath Nandi New Movie,tollywood News

ఎప్పుడు విభిన్న కథనాలు ఎంచుకుంటూ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించేటువంటి యాక్షన్ హీరో గోపీచంద్ ఈసారి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Tollywood Hero Gopichand New First Look Release Date Is Fixed-Gopichand Latest News Gopichand Movie Update Hero Sampath Nandi

అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఫస్ట్ లుక్ ని ఈ నెల 27వ తారీఖున ఉదయం 8.47 నిమిషాలకు  విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అంతేకాకుండా ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా తెలిపాడు.దీంతో ఒక్కసారిగా గోపీచంద్ అభిమానులు ఈ చిత్రంపై ఆశలు పెంచుకుంటున్నారు.

అయితే ఈ చిత్ర కథాంశం పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రం ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ అయినటువంటి పుల్లెల గోపీచంద్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతోందని ఇందులో పుల్లెల గోపీచంద్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా ఈ చిత్రంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన భూమిక చావ్లా కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే గతంలో వచ్చినటువంటి గోపీచంద్ చాణిక్య చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడినప్పటికీ సినీ విమర్శకుల నుంచి మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి.

దీంతో గత కొద్దికాలంగా గోపీచంద్ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.అందువల్ల తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు గోపీచంద్.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సిటీమార్ అనే టైటిల్ని ఖరారు చేసినట్లు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

తాజా వార్తలు

Tollywood Hero Gopichand New First Look Release Date Is Fixed-gopichand Latest News,gopichand New Movie Update,gopichand News,hero Gopichand New Movie Update,sampath Nandi New Movie,tollywood News Related....