టాలీవుడ్ ప్రముఖ హీరో యాదాకృష్ణ గుండెపోటుతో మృతి  

ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కరోనా కారణంగా ఎన్నడూ లేని స్థాయిలో విషాదాన్ని ఎదుర్కొంది.ఓ వైపు సినిమా షూటింగ్ లు ఆగిపోయి ఎంతో మంది కళాకారులు, టెక్నీషియన్స్ అందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

TeluguStop.com - Tollywood Hero Cum Producer Yadakrishna Passes Away

ఇప్పుడిప్పుడే మళ్ళీ షూటింగ్ లు మొదలు కావడంతో మళ్ళీ అంతా గాడిలో పడుతుంది.అయితే ఈ కరోనా సమయంలో ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులు దూరమైపోయారు.

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, అలాగే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లాంటి స్టార్స్ చనిపోయారు.అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి యువ నటుడు ఆత్మహత్య సంచలనంగా మారింది.

TeluguStop.com - టాలీవుడ్ ప్రముఖ హీరో యాదాకృష్ణ గుండెపోటుతో మృతి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎంతో మంచి నటులు అర్ధాంతరంగా ఈ ఏడాది కనుమరుగైపోయారు.ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.

తెలుగులో గుప్త శాస్త్రం, పిక్నిక్, సంక్రాంతి అల్లుడు వంటి చిన్న చిత్రాలలో హీరోగా నటించిన యాదాకృష్ణ గుండెపోటుతో కన్నుమూసారు.ఆయన వయసు 61 సంవత్సరాలు.ఈయన స్వీయ నిర్మాణంలోనే తెరకెక్కించిన సినిమాలలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.2010లో వచ్చిన సంక్రాంతి అల్లుడు సినిమాలో చివరి సారిగా ఆయన తెరపై కనిపించారు.హీరోగా నటించడంతో పాటు చాలా సినిమాలు ఆయన నిర్మించారు.పదేళ్లుగా నటనకి దూరంగా ఉన్న ఆయన వ్యాపారాలలో బిజీగా ఉన్నాడు.తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వ్యవహారాల్లో కూడా భాగస్వామ్యం అయ్యి ఉన్నాడు.బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.

ఈ వార్త తెలిసిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

#Corona Effect #Heart Attack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు