తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సక్సెస్ ఫుల్ హీరో, హీరోయిన్ కాంబినేషన్స్ ఉన్నాయి.అందులో చాలా కాంబినేషన్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యాయి.
ఇందులో పలు కాంబినేషన్స్ యంగ్ లోనే కాదు.చాలా సంవత్సరాల తర్వాత కూడా మళ్లీ కొనసాగాయి.అలా కొన్ని ఏండ్ల తర్వాత రిపీట్ అయిన హీరో, హీరోయిన్ల కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
*వెంకటేష్- మీనా
వీరిద్దరూ యంగ్ ఏజ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు.కొంత కాలం క్రితం విడుదలైన దృశ్యంలో.ప్రస్తుతం దృశ్యం-2లో మళ్లీ కలిసి నటిస్తున్నారు.
*జగపతిబాబు- సుకన్య
మీరిద్దరూ అంతకుముందు పెద్దరికం సినిమాలో కలిసి నటించారు.తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో కలిసి నటించారు.
*వెంకటేష్- భానుప్రియ
వీరిద్దరూ కలిసి స్వర్ణ కమలం సినిమాలో నటించారు.తర్వాత జయం మనదేరా సినిమాలో వెంకటేష్ కి పెయిర్ గా భాను ప్రియ నటించారు.
*బాలకృష్ణ- సిమ్రాన్
బాలకృష్ణ, సిమ్రాన్ సమరసింహారెడ్డి, సీమ సింహం, నరసింహ నాయుడు సినిమాల్లో నటించారు.ఆ తర్వాత ఒక్క మగాడు సినిమాలో ఒక బాలకృష్ణకి పెయిర్ గా సిమ్రాన్ నటించారు.
*జగపతి బాబు- రమ్యకృష్ణ
వీళ్లిద్దరు కలిసి ఆయనకిద్దరు తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో కూడా వీళ్లిద్దరు కలిసి నటించారు.
*నరేష్- సితార
నరేష్, సితార కలిసి మనసు మమత అనే సినిమాలో నటించారు.తర్వాత భలే భలే మగాడివోయ్ సినిమాలో కూడా నటించారు.
*మోహన్ లాల్- దేవయాని
వీరిద్దరూ కలిసి కొన్ని మలయాళం సినిమాల్లో నటించారు.తర్వాత జనతా గ్యారేజ్ సినిమాలో కూడా కలిసి నటించారు.
*అబ్బాస్- టబు
అబ్బాస్, టబు ప్రేమదేశం సినిమాలో కలిసి నటించారు.తర్వాత ఇదీ సంగతి సినిమాలో నటించారు.
*నాగార్జున- రమ్యకృష్ణ
నాగార్జున, రమ్యకృష్ణ కలిసి అంతకు ముందు హలో బ్రదర్ తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.తర్వాత సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో యాక్ట్ చేశారు.
*జగపతి బాబు- కళ్యాణి
జగపతి బాబు, కళ్యాణి కలిసి కబడ్డీ కబడ్డీ, పందెం సినిమాల్లో నటించారు.తర్వాత లెజెండ్ సినిమాలో జగపతి బాబుకి పెయిర్ గా కళ్యాణి చేశారు.
*నరేష్- ఆమని
నరేష్, ఆమని కలిసి అంతకుముందు జంబలకడిపంబ సినిమాలో నటించారు.ఆ తర్వాత చందమామ కథలు సినిమాతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.
*ప్రకాష్ రాజ్- రమ్య కృష్ణ
వీళ్లిద్దరు కలిసి ఆవిడే శ్యామల సినిమాలో నటించారు.ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో నటించారు.