తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో నటిస్తుంటారు.తెలుగులో చాలామంది హీరోయిన్స్ టీచర్ పాత్రలో మెప్పించారు.
ఇక టీచర్స్ పాత్రలో నటించిన హీరోయిన్స్ గురించి ఒక్కసారి చూద్దామా.తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ టీచర్స్ పాత్రలు చేసినా.
అందులో విజయశాంతి ఉపాధ్యాయురాలిగా చేసిన రేపటి పౌరులు, ప్రతిఘటన, సరిలేరు నీకెవ్వరు సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది.
శివ కార్తికేయన్ హీరోగా నటించిన సీమ రాజా సినిమాలో సమంత స్పోర్ట్స్ టీచర్ గా నటించి మెప్పించారు.
అనుపమ పరమేశ్వరన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన రాక్షసుడు సినిమాలో టీచర్ పాత్ర పోషించి ఎంతో చక్కగా ఒదిగిపోయారు.హీరోయిన్ ఆసిన్ కూడా వెంకటేష్ గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ లో వచ్చిన ఘర్షణ సినిమాలో టీచర్ పాత్రను పోషించారు.
వెంకటలక్ష్మీ సినిమాలో టీచర్ పాత్రలో కనువిందు చేసిన రాయ్ లక్ష్మీ.మై హూ నా’ హిందీ సినిమాలో లెక్చరర్ పాత్రలో సుస్మితా సేన్ నటించారు.
అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ అంతకుముందు కొన్ని సినిమాల్లో ఉపాధ్యాయురాలిగా కనిపించగా లేటెస్ట్ గా సిద్ధార్థ తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా లో లెక్చరర్ గా నటించారు.
అక్షర సినిమాలో నందిత శ్వేత ప్రొఫెసర్ గా నటించారు.హ్యాపీడేస్ సినిమాలో కమలిని ముఖర్జీ, గోల్కొండ హై స్కూల్ సినిమాలో స్వాతిలు టీచర్స్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.నేనే అంబానీ’ మూవీలో నయనతార టీచర్ పాత్రలో నటించారు.
ప్రేమమ్’ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనువిందు చేసిన శృతి హాసన్.
అలాగే మలయాళం ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి నటించింది.
ఇక మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’లో టీచర్ పాత్రలో సన్ని లియోన్ కాసేపు కనువిందు చేసింది.తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయం’లో ఉపాధ్యాయురాలి పాత్రలో షకీలా నటించారు.లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పంతులమ్మ’ సినిమాలో పంతులమ్మగా ప్రేక్షకులను మెప్పించింది.మట్టిలో మాణిక్యం’లో చలంను చదువు చెప్పే పంతులమ్మ పాత్రలో జమున మెప్పించింది.