కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు అల్లు రామలింగయ్య.ఆయన శతజయంతి సందర్భంగా శనివారం ఆయన మనవళ్లైన అల్లు అర్జున్, శిరీశ్, వెంకటేశ్(బాబీ) హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారువెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్‌గా అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చారు.
అయితే, అల్లు అరవింద్ సిల్వర్ స్క్రీన్‌పై గెస్ట్ రోల్ చేశాడే తప్ప నటుడిగా కనిపించలేదు.సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్లో కొనసాగుతున్నాడు.
ఇకపోతే ఆయన తనయుడు బన్ని ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు.సాధారణంగా తండ్రికి తగ్గ తనయుడు, తాతకు దగ్గ మనవడు అంటుంటారు.కానీ, బన్ని విషయంలో తాతను మించిన మనవడు అని అనాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.అల్లు రామలింగయ్య తెరపైన నటుడిగానే సత్తా చాటగా, అల్లు అర్జున్ హీరోగా సత్తా చాటుతున్నారు.
నటనలో ప్రావీణ్యం సంపాదిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు.ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప’లో నటిస్తున్నాడు.
అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ తాత-మనవళ్ల ట్రెండ్ కూడా బానే నడస్తున్నది.అనగా ఒక హీరో కుటుంబం నుంచి సెకండ్ జనరేషన్ పోయి థర్డ్ జనరేషన్ హీరోలు కూడా బానే రాణిస్తున్నారు.
ఎన్టీఆర్ కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న హీరోలుగా ఉన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్, సుమంత్ రాణిస్తున్నారు.ఏఎన్ఆర్ మనవళ్లుగా నాగచైతన్య, సుమంత్ రొమాంటిక్ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక గిన్నీస్ రికార్డు ప్రొడ్యూసర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు కుటుంబం నుంచి కూడా మనవడు వచ్చేశాడు.రామా నాయుడు మనవడు రానా దగ్గుబాటి లీడర్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ప్రజెంట్ హీరో రోల్స్‌తో పాటు విలన్ రోల్స్ కూడా ప్లే చేస్తూ సత్తా చాటుతున్నాడు.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా అల్లు రామలింగయ్య మనవడే.
అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ఏకైక కొడుకు.