తెలుగింటి రచయిత్రి సరోజినీ నాయుడు బయోపిక్

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది కీలక భూమిక పోషించారు.అయితే వారిలో అతికొద్ది మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతారు.

 Sarojini Naidu Biopic Going On Sets In Bollywood, Tollywood, Freedom Fighter, Lo-TeluguStop.com

స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో భాగమైన వారు తెలుగు నెలకి చెందిన మహిళామణులు కూడా ఉన్నారు.గాంధీజీని మెప్పించిన వ్యక్తులు ఉన్నారు.

వారిలో ముందు వరుసలో కనిపించే వ్యక్తి సరోజినీనాయుడు.తెలుగింటి కోడలైన ఈమె అప్పటి స్వాతంత్య్రఉద్యమంలో భాగం కావడంతో పాటు స్త్రీల హక్కుల పై పోరాడిన మహిళ, కవయిత్రి, భారతదేశ తొలి మహిళా గవర్నర్, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందింది.

ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న సరోజినీ నాయుడు బయోపిక్ ఇప్పుడు తెరపైకి రాబోతుంది.

సరోజినీ నాయుడు పాత్రను దూరదర్శన్ లో రామాయణ్‌ టీవీ సీరియల్‌లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మారిపోయిన దీపికా చిఖలియా పోషించనున్నారు.

సీతగా అందరికి గుర్తుండిపోయిన ఆమె పలు బాలీవుడ్ సినిమాలలో నటించింది.తెలుగులో కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో చంద్రమతిగా నటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఆన్‌లైన్‌లో సరోజినీగారి గురించి వెతికాను.

లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్‌ విని నిర్ణయం తీసుకుంటాను అని పేర్కొన్నారు.ధీరజ్‌ మిశ్రాయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్‌ టాక్‌.

ఇక ఈ సినిమా కంటెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఉండటంతో, ఇక్కడ కూడా ఆమెకి గుర్తింపు ఉండటంతో తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube