జగ్గు భాయ్ ఉండ‌గా వారెందుకు దండ‌గ‌..! 'అరవింద సమేత' లో జగ్గు భాయ్ ని తీసుకోడానికి కారణం ఎవరంటే.?   Tollywood Found New Villain None Other Than Jagapathi Babu     2018-10-15   11:16:10  IST  Sainath G

అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్ కు పొటాపోటీగా పేరుతెచ్చుకుంటున్నారు జ‌గ్గుబాయ్. హీరో గా కెరీర్ కు బ్రేక్ వచ్చిన తర్వాత లెజెండ్ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు జగపతి బాబు గారు. తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు . ఇక రంగస్థలంతో అయితే నట విశ్వరూపం చూపించారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ లు అంటే బాలీవుడ్ లో వెతికేవారు. కానీ ఇప్పుడు దర్శకులు అందరు జగ్గు భాయ్ వైపే ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆడు మామూలోడు కాదు బాల్రెడ్డి .. చావు చొక్కాలేకుండా తిరుగుట ఎట్లుంటాడో చెలుసా ?… ఆడి పొగరు .. చూచుంటే ముచ్చటేస్తుంది బాల్రెడ్డి అంటూ అరవింద సమేత లో తనదైన విలనిజంతో ఆకట్టుకున్నాడు జగపతిబాబు. ప్రస్తుతం నెగిటివ్ పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు జగ్గూభాయ్.

ఒక్క తెలుగులోనే కాదు .. అటు తమిళ, హిందీ భాషల్లో కూడా జగ్గు భాయ్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయి . మొత్తానికి తెలుగులో హీరోలకు సమఉజ్జి లా మంచి విలన్ దొరికేసాడని అంటున్నారు ఆడియన్స్.

Tollywood Found New Villain None Other Than Jagapathi Babu-

అసలు అరవింద సమేతలో జగ్గు భాయ్ ని విలన్ గా సెలెక్ట్ చేయడానికి త్రివిక్రమ్ అంతగా ఆసక్తి చూపలేదు అంట. జ‌గ‌ప‌తి అయితేనే పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌ర‌నే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ గ‌ట్టిగ ప్ర‌పోజ్ చేసార‌ట దీంతో త్రివిక్ర‌మ్ ఓకే చెప్పాల్సి వ‌చ్చింది. క‌ట్ చేస్తే జ‌గ‌ప‌తి క్యారెక్ట‌ర్ సెన్సేష‌న్ ను స్రుష్టిస్తోంది 3 Attachments