Bobby Deol : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి స్ట్రాంగ్ విలన్ దొరికేసాడు.. హీరో కి గట్టి పోటీ కదా !

ఆనిమల్ సినిమా( Animal )… ఈ చిత్రం గురించి ఇప్పటికే మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా అలాగే హీరోగా నటించిన రణబీర్ కపూర్, హీరోయిన్ గా నటించిన రష్మిక గురించి పలు రకాల ఆర్టికల్స్ మనం చూసాం.

 Tollywood Found New Vilain From Bollywood Bobby Deol-TeluguStop.com

ఇక ఇప్పుడు చాలా మంది నోటీస్ చేయని విషయం ఏమిటంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడు కానీ రణబీర్ కపూర్ కి దీటుగా నటించిన విలన్ బాబీ డియోల్ నటించాడు.బాబీ డియోల్ చాలా ఏళ్లుగా హీరోగా నటిస్తూ వచ్చాడు.2010 నుంచి దాదాపు అతడు అన్ని కూడా మల్టీ స్టారర్ సినిమాల ద్వారానే ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు.ఈ బాబీ డియోల్ మరెవరో కాదు హీరో ధర్మేంద్ర యొక్క చిన్న కుమారుడు.

Telugu Animal, Bobby Deol, Bollywood, Dharmendra, Harihara, Kanguva, Ranbir Kapo

ఖచ్చితంగా ఇది బాబీకి విలన్ గా స్ట్రాంగ్ సెట్ బ్యాక్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ చిత్రం ద్వారా ప్రాపర్ గా లాంచ్ అయ్యాడు ఈ చిత్రం లో రణబీర్ కపూర్ ఎలా అయితే నటించాడో అతని కంటే ఎంతో మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ బాబి ఇచ్చాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత లీడ్ గా నటించిన మొట్టమొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు బాబి.ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించాడు కానీ కాస్త వయసు మీద పడటంతో అవకాశాలు తగ్గాయి.2010 నుంచి దాదాపు ముగ్గురు హీరోలు లేదా ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలోని నటిస్తూ వస్తున్నాడు.బాబీ డియోల్ లో ఇది మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్నింగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు.ఈ సినిమాలో పర్ఫామెన్స్ వైస్ గా బాబీకి ఎన్ని మార్కులు ఇచ్చినా కూడా తక్కువే.

ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప విలన్ దొరికాడు అని అందరూ అనుకుంటున్నారు.పైగా ఆనిమల్ సినిమా తర్వాత చాలా బిజీ యాక్టర్ గా కూడా బాబీ డియోల్ ( Bobby Deol )మారిపోయాడు.

Telugu Animal, Bobby Deol, Bollywood, Dharmendra, Harihara, Kanguva, Ranbir Kapo

తమిళ్లో హీరో సూర్య నటిస్తున్న కండువా సినిమాలో కూడా బాబీ నటిస్తుండగా తెలుగు సినిమాల విషయాలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా బాబి ఉన్నాడు.అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 109వ సినిమాలో కూడా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు ఒప్పుకుంటూ సౌత్ ఇండియాలోనే గ్రేట్ విలన్ గా అవతారం ఎత్తెందుకు బాబీ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.పైగా ఈ మధ్యకాలంలో విలన్ల కొరత బాగా తెలుగులో ఎక్కువైపోయింది.

అందుకే బాబి లాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న విలన్ దొరికితే ఎవరు కాదంటారు చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube