ఒకప్పటి ఈ ఫేమస్ విలన్ చివరి రోజుల్లో దారుణమైన పరిస్థితులను...

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు “విలనిజం” అంటే ఏంటో పరిచయం చేసినటువంటి సీనియర్ నటుడు రామి రెడ్డి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే అయితే రామి రెడ్డి  గురించి ఇప్పటి తరం ప్రేక్షకులకి కొంతమేర తెలియకపోవచ్చు కానీ 90 సంవత్సర కాలంలోని సినీ ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుంటాడు.

 Tollywood Former Villain Rami Reddy Death News, Rami Reddy, Tollywood Former Vil-TeluguStop.com

అయితే అప్పట్లో నటుడు రామిరెడ్డి పలు టాలీవుడ్ చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.కానీ ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

 దీంతో సినిమాలపై  పెట్టిన డబ్బులు మొత్తం అయిపోయి చివరికి అప్పుల పాలయ్యాడు.దీంతో ఒకానొక సమయంలో సినీ పరిశ్రమని వదిలిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నాడు.

కానీ చివరి ప్రయత్నంగా తెలుగులో యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన “అంకుశం” చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు.దీంతో రామిరెడ్డి నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో ఒసేయ్ రాములమ్మ, అమ్మోరు, బలరామకృష్ణులు, తదితర హిట్ చిత్రాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.దీంతో రామిరెడ్డి తెలుగులోనే కాక తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్ పూరి, తదితర భాషలలో కూడా నటించాడు.

అయితే రామి రెడ్డి తన సినీ ప్రస్థానంలో దాదాపుగా 250కి పైగా చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.

అయితే ఒకప్పుడు చేతినిండా సినిమాలతో కెరియర్ బిజీగా సాగుతున్న సమయంలో రామి రెడ్డి  కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురయ్యాడు.

దీంతో పూర్తి అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం చివరి దశలో హాస్పిటల్స్ లోనే గడిపాడు.చివరికి 2011వ సంవత్సరంలో కన్ను మూసాడు.ఏదేమైనప్పటికీ ఒకప్పటి తెలుగు సినీ పరిశ్రమకి విలనిజం అంటే ఏంటో పరిచయం చేసింది మాత్రం రామిరెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube