ఒకప్పటి ఈ  యాక్టర్ చిన్న వయసులోనే అప్పులు చేసి దీన స్థితిలో...

తెలుగులో ప్రముఖ దర్శకుడు అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన “తమ్ముడు” అనే చిత్రంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చక్రి  పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న స్వర్గీయ నటుడు అచ్యుత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అచ్యుత్ సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో పలు సీరియళ్లలో నటించే అవకాశాలు దక్కించుకొని ఆ తర్వాత మెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు.

 Tollywood Former Actor Achyuth Death News, Achyuth, Tollywood Former Actor,  Dea-TeluguStop.com

ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తదితరులతో మంచి సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకున్నాడు.దీంతో వీరిద్దరూ అప్పట్లో అచ్యుత్ కి అవకాశాల విషయంలో బాగానే సహాయపడ్డారు.

అయితే చేతి నిండా  సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో అచ్యుత్ కి బిజినెస్ పై మనసు మళ్లింది.ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలోచనే అతడి పూర్తి జీవితాన్ని మలుపు తిప్పడమేగాకుండా, అతడి సినీ కెరీర్ పతనమవడానికి కూడా కారణమైంది.

అయితే అప్పట్లో ప్రింటింగ్ బిజినెస్ కి మంచి గిరాకీ ఉండడంతో దాదాపుగా 50 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.

అయితే మొదట్లో ఈ వ్యాపారం బాగానే నడుస్తుండటంతో ఇక తాను సినిమాలపై దృష్టి సారిస్తూ తన వ్యాపారాన్ని కొంతమంది స్నేహితులను నమ్మి వారి చేతుల్లో పెట్టాడు.

దీంతో అతడి స్నేహితులు లాభాలను అచ్యుత్  కి చూపకుండా మోసం చేయడమే కాకుండా ఏకంగా వ్యాపారాన్ని దివాలా తీయించే స్థాయికి తీసుకొచ్చారు.

దీంతో నమ్మిన వారే తనని మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన అచ్యుత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో గుండె సంబంధిత జబ్బులకు గురయ్యాడు.చివరికి వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేనటువంటి దీన స్థితిలోకి చేరుకున్నాడు.

దీంతో కనీసం 42 ఏళ్లు కూడా నిండకుండానే అచ్యుత్ కన్ను మూసాడు.అయితే ఇప్పటికీ కొంతమంది అచ్యుత్ సినీ ఇండస్ట్రీ స్నేహితులు ఆయన మరణం పై స్పందిస్తూ అప్పట్లో సినీ జీవితం పై దృష్టి సారించకుండా వ్యాపారం పై మొగ్గు చూపడమే అతడి మరణానికి ముఖ్య కారణమని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube