స్టార్ హీరోస్ సినిమాలు ఫ్లాప్ దర్శకుల చేతిలో..మరి గట్టెక్కేనా..?

ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా పేరు వచ్చేది దర్శకుడికే.ఫ్లాప్ డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లు, హీరోలు సినిమాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు.

 Tollywood Flop Directors Second Innings-TeluguStop.com

కనీసం ఫ్లాప్ డైరెక్టర్లు చెప్పే కథ వినడానికి కూడా ఆసక్తి కనబరిచరు.ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సరే రెండు సినిమాలు ప్లాప్ అయితే ఇక ఆయన్ని సినిమా ఇండస్ట్రీ మూలకు పెడుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ చాలామంది ఫ్లాప్ డైరెక్టర్ల ను పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే.బొమ్మరిల్లు భాస్కర్, శ్రీనువైట్ల, వి.వి వినాయక్ వంటి దర్శకులు మంచి హిట్ సినిమాలను అందించారు కానీ కొన్నేళ్ళ క్రితం డిజాస్టర్ సినిమాలను తీసి ఇండస్ట్రీకి దూరమైపోయారు.వారెవరో.ఇప్పుడు ఏం ఛాన్సులు సంపాదించారో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

 Tollywood Flop Directors Second Innings-స్టార్ హీరోస్ సినిమాలు ఫ్లాప్ దర్శకుల చేతిలో..మరి గట్టెక్కేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వి వి వినాయక్

దిల్, ఆది, టాగూర్, బన్నీ వంటి సినిమాలను తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా పేరొందిన వి.వి వినాయక్ కొన్నేళ్ళ క్రితం ఇంటిలిజెన్స్ సినిమాని తీశారు.అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో వి.

వి.వినాయక్ కి మరో ఛాన్సులు రాలేదు.అయితే చాలా కాలం తర్వాత ఆయనకు బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.వినాయక్ చత్రపతి రీమేక్ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి మళ్లీ తన పేరును నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

మెహర్ రమేష్

మెహర్ రమేష్ కూడా షాడో సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ని చవిచూశారు.ఆ సినిమా తర్వాత మెహర్ రమేష్ కి ఏడేళ్ల వరకూ మళ్లీ ఏ ఒక్క మూవీ ఛాన్సు కూడా రాలేదు.అయితే తాజాగా చిరంజీవి వేదాళం రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ను మెహర్ రమేష్ కి పొందారు.చిరంజీవి మూవీ కి దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మెహర్ రమేష్ గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారో లేదో చూడాలి.

బొమ్మరిల్లు భాస్కర్

బొమ్మరిల్లు, పరుగు వంటి పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన భాస్కర్ ఒంగోలు గిత్త సినిమా తీశారు కానీ అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.దీంతో బొమ్మరిల్లు భాస్కర్ టాలీవుడ్ నుంచి వెళ్లి కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు తీశారు కానీ అక్కడ కూడా అతనికి అంతగా ప్రాధాన్యత దక్కలేదు.తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై దాదాపు ఏడేళ్లు అవుతున్న నేపథ్యంలో ఈయన అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ని పట్టేశారు.మరి డైరెక్టర్ భాస్కర్ ఈ సినిమాతోనైనా మళ్లీ ఫామ్ లోకి వస్తారా అనేది తెలియాల్సి ఉంది.

శ్రీను వైట్ల

ఆనందం, వెంకీ ,దుబాయ్ శీను వంటి హిట్ చిత్రాలను అందించిన శ్రీను వైట్ల ఆగడు ,సినిమాతో ఫ్లాప్ డైరెక్టర్ గా మారిపోయారు.ఈ సినిమా తర్వాత ఆయన ఇండస్ట్రీకి చాలా కాలం దూరం అయ్యారు.ప్రస్తుతం ఆయన డి అంటే ఢీ డబల్ డోస్ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ పట్టేశారు.ఈ సినిమా మంచు విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమా కి సీక్వెల్ కాగా.ఈ సినిమాతో అయినా శ్రీనువైట్ల తనపై పడిన ఫ్లాప్ డైరెక్టర్ ముద్రను చేరిపివేస్తారో లేదో మరి.

శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల కూడా ఫైవ్ స్టార్ గా పేరు పొందారు కానీ ఇప్పుడు ఆయన వెంకటేష్ తో కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా సూపర్ హిట్ అయితే శ్రీకాంత్ అడ్డాల కి మంచి పేరు రావడం ఖాయం.

#Meher Ramesh #V V Vinayak #Gunasekhar #Srinu Vaitla #Srikanth Addala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు