తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి హీరోయిన్ స్టేజి పైననే పుట్టింది

చిత్ర పరిశ్రమలోకిపాత హీరోయిన్లు కనుమరుగయ్యి కొత్త హీరోయిన్లు రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.కానీ చిత్ర పరిశ్రమ మొదలైనప్పుడు మొదటగా హీరోయిన్ గా అవతరించిన మహిళ ఎవరు అన్నది మాత్రం చాలామందికి తెలియదు.

 Tollywood First Heroine Kamalabai Unknown Facts Details, Tollywood, Telugu First-TeluguStop.com

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి హీరోయిన్ గా రాణించిన మహిళా ఏకంగా ఒక నాటకరంగ స్టేజ్ మీద పుట్టింది.ఆమె ఎవరో కాదు కమలాబాయి.

దాదాపు నేటితరం ప్రేక్షకులందరికీ కమలాబాయి ఎవరు అన్నది దాదాపు తెలిసి ఉండకపోవచ్చు.కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమలాబాయి.

1908 సంవత్సరం లో సురభి నాటక సంస్థ వారు గుంటూరులో నాటక ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నాటకంలో నటిస్తున్న ఒక నటికి పురిటి నొప్పులు వచ్చాయి.దీంతో ఇక ఆ మహిళ అక్కడే ఒక ఆడ బిడ్డకు ప్రసవించింది.

ఆ ఆడబిడ్డ కమలాబాయి. తెలుగు చిత్రపరిశ్రమకు మొట్టమొదటి హీరోయిన్.

భక్త ప్రహ్లాద సినిమాలో లీలావతి పాత్రలో నటించి తన నటనతో అద్భుతమే సృష్టించింది.సహజనటిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.

నటనలోనే కాదు నాట్యకళలో గానంలో కూడా ఆరితేరిన కమలాబాయి తెలుగునాట ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

ఇక సినీ రంగంలో ఆమె ఎన్నో అవార్డులు రివార్డులు సైతం సొంతం చేసుకున్నారు అని చెప్పాలి.ఒకవైపు హీరోయిన్గా నటనతో మెప్పిస్తునే మరోవైపు తన మధురమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ మనసులో పులకింప చేసింది కమలాబాయి.ఇక పాతాళభైరవి సినిమాలో తోటరాముడుకి తల్లి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కమలాబాయి.

ఆ తర్వాత 1953లో వచ్చిన అమ్మలక్కలు చిత్రంలో కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.

కేవలం తెలుగులోనే కాదండోయ్ హిందీలో కూడా నటించి సత్తా చాటాడు కమలాబాయి.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కమల బాయి పై చివరి రోజుల్లో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారట.ఇలా కమలాబాయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆమెకు అండగా నిలబడ్డారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube