ఏప్రిల్‌ మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా అంటూ ఫిల్మ్‌ మేకర్స్‌ చర్చలు

గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమా పరిశ్రమ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.కేవలం టాలీవుడ్‌ అనడం కంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని సినిమా పరిశ్రమలు కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయి.

 Tollywood Film Makers Dissuss With Coronavirus Effect In Film Industry-TeluguStop.com

ఇండియాలో థియేటర్ల బంద్‌ కొనసాగుతోంది.మార్చి 31 వరకు అంటూ మొదట ప్రకటించారు.

కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మార్చి 31 తర్వాత కూడా థియేటర్ల బంద్‌ ఇంకా ఇతర బంద్‌ లు కొనసాగే అవకాశం కనిపిస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొనసాగితే ఏం చేయాలనే విషయమై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏప్రిల్‌ మొదటి వారం నుండి మొదలుకుని సమ్మర్‌ సినిమాల సందడి మొదలు కావాల్సి ఉన్నాయి.ఉగాది కానుకగా కూడా సినిమాలు విడుదల చేయాలని భావించారు.

కాని అది నూటికి నూరు శాతం సాధ్యం కాదు.కాని ఏప్రిల్‌ 1 తర్వాత అయినా సినిమాలు విడుదలకు నోచుకుంటాయా అంటూ కొందరు ఎదురు చూస్తున్నారు.

కాని సినిమాల విడుదల లేకుంటే చేయాల్సిన పని ఏంటీ అంటూ విడుదలకు ఎదురు చూస్తున్న నిర్మాతలు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

Telugu Coronaeffect, Makerssuffer, Telanganacinima, Tollywood-Movie

చిన్నా పెద్దా సినిమాలు కలిసి మొత్తంగా పాతిక సినిమాలు ఏప్రిల్‌లో విడుదల అవ్వాల్సి ఉంది.కాని అవేవి ఇప్పుడు విడుదల అయ్యే విషయమై క్లారిటీ లేదు.నిన్న మొన్నటి వరకు వస్తామంటూ కొందరు ప్రచారాలు చేశారు, పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించారు.

కాని ఆ ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ఆపేశారు.ఆ తర్వాత వుసగా చిత్రాలు వస్తాయా అనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

ఒక వేళ మేలో థియేటర్లు రీ ఓపెన్‌ అయితే అప్పుడు వారంలో మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద యుద్దంకు దిగే అవకాశం ఉందని అంటున్నారు.ఆ సమయంలో ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube